బాలీవుడ్ లో సర్జరీలు చేయించుకున్న స్టార్ హీరోలు వీళ్ళే!

మాములుగా హీరో అంటే జిమ్ బాడీ, ఆరడుగుల ఎత్తు,ఎంత వయసు అయిన కూడా యంగ్ గా కనిపిస్తుంటారు.ఇకపోతే సినిమా సినిమాకి హీరోలు వారి హెయిర్ స్టైల్,బాడీ స్ట్రక్చర్, డ్రెస్సింగ్ స్టైల్ ఇలా ప్రతి ఒక్కటి పూర్తిగా మార్చేస్తూ ఉంటారు.

 These Are The Star Heroes Have Undergone Surgeries In Bollywood , Bollywood Hero-TeluguStop.com

కొన్ని కొన్ని సార్లు అభిమానులు హీరోలను చూసేందుకే థియేటర్లకు వస్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.అందువల్లే హీరోలు ఎల్లప్పుడు ఎక్కువగా లుక్స్‌కు ప్రాధాన్యమిస్తుంటారు.

ఇంకా అవసమైతే సర్జరీలు కూడా చేయించుకుంటారు.అలా హ్యాండ్స‌మ్‌గా కనిపించడానికీ కొంత మంది బాలీవుడ్ హీరోలు సర్జరీలు చేయించుకున్నారు.

ఆ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

బాలీవుడ్ స్టార్ హీరో బాద్ షా అయిన షారుఖ్ ఖాన్ గురించి మనందరికి తెలిసిందే.

షారూక్ బొటాక్స్ ట్రీట్‌మెంట్‌తో పాటు, యంగ్‌గా కనిపించడానికీ కొన్ని ఇంజెక్షన్లను కూడా తీసుకున్నాడు.ముడతలను తగ్గించడానికీ బొటాక్స్ ఇంజక్షన్స్ తీసుకుంటుంటారు.మరో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్.షాహిద్‌ కపూర్ ని అభిమానులు చాక్లెట్ బాయ్ అని పిలిచేవారు.

షాహిద్ కపూర్ కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని బాలీవుడ్ మీడియా వర్గాలలో వార్తలు కోడై కూస్తోంది.బాలీవుడ్ కండల వీరుడు హీరో సల్మాన్ ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే.

సల్మాన్ ఖాన్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్‌తో పాటు, బొటాక్స్ సర్జరీ చేయించుకున్నారు.

Telugu Shah Rukh Khan, Shahid Kapoor, Shahrukh Botox-Movie

మరొక హీరో అమీర్ ఖాన్.అభిమానులు అమీర్ ఖాన్ ని మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుస్తుంటారు.అమీర్ ఖాన్ కూడా ముఖం పై ముడతలను తగ్గించుకోవడానికీ కాస్మోటిక్ సర్జరీని చేయించుకున్నారు.

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా అక్కీ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నాడు.మరో బాలీవుడ్ స్టార్ హీరో అయిన రణ్‌బీర్ కపూర్ కూడా పెళ్లికి ముందే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నాడు.

హీరో,నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా అతడు బొటాక్స్ ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube