ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ ను ఏలిన సౌత్ స్టార్ డైరెక్టర్లు వీళ్లే?

ఒకానొక సమయంలో సినిమా అంటే కేవలం ఒక భాషకు మాత్రమే పరిమితం అయ్యేది.కానీ ప్రస్తుతం సినిమా అంటే ఇండియన్ సినిమా అని, ఒక బాషలో సినిమా తెరకెక్కిన అన్ని భాషలలోనూ ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.

 These Are The Directors Of South Star Who Ruled The Indian Box Office This Year,-TeluguStop.com

అందుకే ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాల హడావిడి ఎక్కువగానే ఉందని చెప్పాలి.బాలీవుడ్ సినిమాలు సౌత్ లో విడుదల అవుతూ ఇక్కడ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగా సౌత్ సినిమాలో కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి.

ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో ఈ సంవత్సరంలో బాక్సాఫీస్ ను షేక్ చేసినటువంటి సినిమాల గురించి అలాగే డైరెక్టర్ల గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.మరి ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో షేక్ చేసినటువంటి వారిలో సౌత్ డైరెక్టర్లు అధికంగా ఉన్నారని తెలుస్తుంది.

మరి ఆ సౌత్ డైరెక్టర్లు ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే.సందీప్ రెడ్డి ( Sandeep Reddy ) వంగ దక్షిణాది దర్శకుడు అయినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.

ఈయన ఇటీవల యానిమల్ ( Animal ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు డిసెంబర్ ఒకటవ తేదీ రణబీర్ కపూర్ రష్మిక నటించినటువంటి యానిమల్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది.

ప్రభాస్ హీరోగా సలార్( Salaar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాకు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వం వహించారు.ఈ సినిమా కూడా ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని చెప్పాలి కేవలం మూడు రోజుల వ్యవధిలోని 400 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సంచలనాలను సృష్టిస్తుంది.

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందినవారు.అనే సంగతి మనకు తెలిసిందే.వీరితోపాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj ) లియో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే సక్సెస్ అందుకున్నారు.

ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం జవాన్ ఈ సినిమా కూడా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సంచలనాలను సృష్టించింది ఇక ఈ సినిమాకు డైరెక్టర్గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ( Atlee ) వ్యవహరించారు.ఈ సినిమా ద్వారా కూడా అట్లీ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి సక్సెస్ సాధించారు.ఇక జైలర్ సినిమా ద్వారా మరో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్( Nelson Deelip Kumar ) .ఈయన కూడా రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే సెన్సేషనల్ హిట్ అందుకున్నారు.ఇలా ఈ ఏడాది సౌత్ ఇండస్ట్రీ నుంచి పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించారని చెప్పాలి.

https://www.facebook.com/story.php?story_fbid=pfbid0wHhJNwVER9baCWtkgtmen4yz95zSWsnkHW4m5RxcaUg1RQxQVRZB1HykKJPBNPbbl&id=100064888052115&post_id=100064888052115_pfbid0wHhJNwVER9baCWtkgtmen4yz95zSWsnkHW4m5RxcaUg1RQxQVRZB1HykKJPBNPbbl&sfnsn=wiwspwa&mibextid=6aamW6&paipv=0&eav=AfaDDD4DjdOBP1UZcj3FHRHLv-fYRMkIMxz7I67fswnO2mZHMMA-chwn793_sTPmMCs&_rdr
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube