రాజస్థానీ గాగ్రా-చోళీ ధరించి ఫారిన్ దేశంలో చక్కర్లు.. యువతి వీడియో వైరల్..

ఇటీవల కాలంలో భారతీయ మగువలు ఇండియన్ కల్చర్, ఇండియన్ డ్రెస్సింగ్ స్టైల్‌ను ప్రపంచ వేదికగా ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే.చాలామంది చీర కట్టుకుని లండన్( London ) వీధుల్లో తిరగడం, అమెరికా వీధుల్లో నడవడం మనం చూస్తూనే ఉన్నాం.

 The Video Of A Young Woman Cycling In A Foreign Country Wearing A Rajasthani Gag-TeluguStop.com

తాజాగా మరో ఒక భారతీయ మహిళ ఒక పరాయి దేశంలో రాజస్థానీ గాగ్రా ఛోళీ( Rajasthani Gagra Choli ) ధరించి వీధుల్లో నడించింది.ఆమె అలా నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆమెను రాజస్థానీ ఘాగ్రా ఛోళీలో చూసి చాలామంది విదేశీయులు ఆశ్చర్యపోయారు.ఆమె అందమైన దుస్తులకు ఫిదా అయిపోయారు.కొంతమంది ఆమె ఫోటోలు కూడా తీసుకున్నారు.ఈ భారతీయ యువతి ధరించిన రెడ్-యెల్లో గాగ్రా ఛోళీ అద్భుతంగా ఉండటంతో చాలామంది ఫిదా అవుతున్నారు.ఈ వీడియోకు 5 లక్షలకు పైగా వ్యూస్, 74,101 లైక్‌లు వచ్చాయి.చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను చూసి ఆమెను అభినందించారు.

ఒక వ్యక్తి కామెంట్ చేస్తూ “మన సంస్కృతి, మన దుస్తులే మన గుర్తింపు.” అని అన్నారు.“ఈ మోడ్రన్ వరల్డ్‌లో మన భారతీయ సంస్కృతి గౌరవాన్ని కాపాడటానికి మీరు చాలా చేశారు, ధన్యవాదాలు!” అని ఒక నెటిజన్ అభినందించాడు.మొత్తంమీద, ఈ వీడియోను చూసిన ప్రేక్షకుల నుంచి ఈ మహిళకు చాలా ప్రశంసలు లభించాయి.

ఇలాంటి మరో సంఘటనలో, మే నెలలో జపాన్ వీధుల్లో బ్లూ కలర్ శారీ ధరించి, తిరుగుతున్న ఒక మహిళ వీడియో కూడా వైరల్ అయింది.ఆమె చీరపై అద్భుతమైన గోల్డెన్ బోర్డర్స్ కూడా కనిపించాయి.

భవిష్యత్తులో మగవారు కూడా భారతీయ సంస్కృతిని ప్రదర్శించవచ్చు.గతంలో ఒక యువతి మగవారు కట్టే లుంగీ కట్టి ఓ విదేశంలో తిరిగింది.

ఆ వీడియో కూడా వైరల్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube