కొడుకు నోట ఆ మాట వినడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భార్య నేరుగా భర్త వద్దకు వెళ్లి గొడవ పెట్టుకుంది.భర్త బతికుంటే తాను ప్రశాంతంగా ఉండలేనని, తన పరువు మొత్తం తీసేస్తున్నాడని భావించిన భార్య.
ఏకంగా భర్తను కత్తితో పొడిచి హత్య చేసింది.ఈ ఘటన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో సోమవారం వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.నల్గొండ జిల్లా బుసిరెడ్డి గూడ గ్రామానికి చెందిన 42 ఏళ్ల మురళీధర్ రెడ్డికి అదే గ్రామానికి చెందిన మౌనికతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది.
బతుకు దెరువు కోసం 11 ఏళ్ల కిందట ఈ దంపతులు నగరానికి వలసొచ్చారు.ప్రస్తుతం వీరు సరూర్ నగర్‌లో నివాసముంటున్నారు.వీరికి తొమ్మిదేళ్ల కుమారుడు.దంపతులు ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగులు.
మురళీధర్ రెడ్డి హైటెక్ సిటీలోని ఓ హార్డ్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు.ఈ క్రమంలోనే డిగ్రీ పరీక్షలు రాసేందుకు ఈ నెల 5వ తేదీన భార్య మౌనిక గుంటూరుకు వెళ్లింది.
తిరిగి మరుసటి రోజున హైదరాబాద్‌కు వచ్చింది.అయితే, తల్లి మౌనిక ఇంటికి రాగానే కొడుకు ‘డాడీ’ నీ గురించి అందరికీ ‘చెడు’గా చెబుతున్నాడని తెలిపాడు.
కొడుకు నోట ఆ మాట విని మౌనిక కోపంగా భర్త వద్దకు వెళ్లి ఎందుకు ఇలా చేస్తున్నావని నిలదీసింది.తన క్యారెక్టర్ బ్యాడ్ అని ఎందుకు ఇతురులకు చెబుతున్నావని గట్టిగా అడుగడంతో దంపతులు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.దీంతో భర్త బతికి ఉంటే తన మీద ఇంకెన్ని రూమర్లు క్రియేట్ చేసి పరువు తీస్తాడో అని భావించి మురళిధర్ రెడ్డి పడుకున్నాక కూరగాయాలు కట్ చేసే కత్తితో గొంతులో పొడిచి హత్య చేసింది.ఆ తర్వాత తప్పించుకుందామని భావించిన మౌనిక.నేరుగా సరూర్ నగర్ పోలీస్‌స్టేషన్ వెళ్ళి లొంగి పోయింది.ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.