రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో ఇటీవల చోటు చేసుకున్న నవీన్ హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది.నిందితుడు హరిహరకృష్ణను అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే.
అయితే పోలీసుల విచారణకు హరిహరకృష్ణ ఏ మాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది.హత్యలో మరికొందరి ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే వాళ్ల పేర్లు చెప్పడానికి హరిహరకృష్ణ మొండికేస్తున్నాడని… తనను మాత్రమే విచారించాలని చెబుతున్నాడని తెలిపారు.అంతేకాకుండా చట్టం తనకు తెలుసని పోలీసులతో వాదనకు దిగాడని, అందులో ఉన్న లోసుగులే తనను బయటకు తీసుకొస్తాయంటున్నాడని సమాచారం.
హత్య, చట్టాలపై సోషల్ మీడియా ద్వారా అవగాహన పెంచుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.