తెలుగు సినిమాలకు సమంత గుడ్ బై చెప్పానుందా.. ఆ వీడియోతో కన్ఫ్యూజన్ లో పడిన ఫ్యాన్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ సమంత.తన నటనతో మంచి మార్కులు సంపాదించుకుని.అందంతో మాత్రం కుర్రాళ్ల మతి పోగొట్టింది.అతి తక్కువ సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదా ను సంపాదించుకుంది.ఇక అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.కానీ తన జీవితాన్ని విడాకులతో ముక్కలు చేసుకుంది.

 Did Samantha Say Goodbye To Telugu Movies Are The Fans Confused By That Video ,s-TeluguStop.com

ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది సమంత.తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.

ఇక తనతో కలిసి నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత సమంత అవకాశాలతో గాల్లోకి ఎగిరిందని చెప్పవచ్చు.ఎందుకంటే పెళ్లి తర్వాత సమంత సినిమాలలో మరింత క్రేజ్ సంపాదించుకుంది.వెండితెరపైనే కాకుండా ఓటీటీ లో ఆహా లో సామ్ జామ్ అనే షోకు కూడా హోస్టింగ్ చేసింది.

పలు బిజినెస్ లు కూడా ప్రారంభించింది.

పెళ్లి తర్వాత నాగచైతన్య తో కలిసి సినిమాలలో నటించింది.బుల్లితెర ప్రకటనల్లో కూడా నటించింది.ఇక సోషల్ మీడియాలో మాత్రం సమంత బాగా యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం తనకు సంబంధించిన వర్కవుట్లు వీడియోలను, ట్రెండీ ఫోటోలను బాగా పంచుకుంటుంది.అలా తన కెరీర్ జీవితం, పెళ్లి జీవితం సజావుగా సాగుతున్న సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ తన పెళ్లి జీవితానికి ముగింపు పలికింది సమంత.

తాము విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగా తెలిపి అందరికీ షాక్ ఇచ్చింది.దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం వీరి గురించి హాట్ టాపిక్ గా మారింది.చాలా వరకు సమంత పైనే విమర్శలు చేశారు.ఇక మొత్తానికి ఇద్దరు విడిపోయి తమ తమ కొత్త జీవితాలతో బిజీగా మారారు.విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది సమంత.తనకు అక్కినేని ఫ్యామిలీ తో సంబంధం కట్ కావటంతో తన క్లీవేజ్ షో లకు అడ్డు చెప్పేవాళ్లే లేరని చెప్పాలి.

పొట్టి పొట్టి బట్టలతో గ్లామర్ లుక్ లతో అందర్నీ తన వైపు మలుపుకుంటుంది.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా అవకాశాలు అందుకుంటుంది.ఇక గత ఏడాది మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని కూడా తెలిపి బాగా సింపతి పెంచుకుంది.ఇక ప్రస్తుతం ఈమె శాకుంతలం సినిమాలో నటించగా త్వరలో ఆ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

ఇక ముందు సైన్ చేసిన సినిమాలలో తప్ప.కొత్త ప్రాజెక్టులకు అసలు ఒప్పుకోవటం లేదు సమంత.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో పంచుకుంది.అందులో కన్నడ భాషలో ఫేస్ వాష్ కి సంబంధించిన అడ్వటైజ్మెంట్ చేసింది.దీంతో ఆ వీడియో చూసి తెలుగు ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.తెలుగులో కొత్త సినిమాలకు సైన్ చేయకపోవడంతో.ఇక కన్నడలోనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యిందా.అంటే సమంత తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పనుందా అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube