సింగపూర్‌లో ( Singapore )టెక్నాలజీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వైష్ణవి జయకుమార్ ( Vaishnavi Jayakumar )అనే ఎన్నారై ఫేసుబుక్ మాతృ సంస్థ మెటాకు షాక్ ఇచ్చారు.తాజాగా ఆమె కాలిఫోర్నియా పౌర హక్కుల డిపార్ట్‌మెంట్‌కి మెటా కంపెనీపై ఫిర్యాదు చేశారు.
టెక్ దిగ్గజం మెటా తన జాతి కారణంగా తన పట్ల వివక్ష చూపిందని, తాను ఆసియావాసి ( Asian )అయినందున తన పట్ల అన్యాయంగా ప్రవర్తించిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ వివక్ష కారణంగానే తనకు ప్రమోషన్లు, ఉద్యోగావకాశాలు లభించలేదని ఆమె ఆరోపించారు.
తన కంటే తక్కువ అనుభవం ఉన్న తన సహోద్యోగులతో పోలిస్తే, తనతో భిన్నంగా మెటా అధికారులు వ్యవహరించారని, ముఖ్యమైన పనిని ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.
వైష్ణవి జయకుమార్ మెటాలో ఒక జాబ్ చేసేవారు.అక్కడ ఆమె కంపెనీ యాప్‌లు, సేవలు యువతకు తగినవిగా ఉండేలా చూసుకునేవారు.మొదట్లో అంతా బాగానే ఉందని, తన పనికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని ఆమె వెల్లడించారు.
అయితే రెండేళ్ల తర్వాత ప్రమోషన్ గురించి అడిగినప్పుడు కంపెనీ యాజమాన్యం తనకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేసిందని ఆమె ఆరోపించారు.ముఖ్యంగా మేనేజర్ తన జాతిని చులకనగా చూడటం ప్రారంభించారట.
ఇతర అభ్యర్థుల కంటే తనకు ఎక్కువ అనుభవం ఉందని, అయినా నాయకత్వ స్థానానికి అర్హత పొందలేదని ఆమె వాపోయారు.
వైష్ణవి జయకుమార్ ఫిర్యాదులో Ascend అనే గ్రూప్ చేసిన అధ్యయనాన్ని ప్రస్తావించారు, మెటాలో( Meta ) పనిచేసే వారిలో దాదాపు సగం మంది ఆసియన్లు ఉన్నా, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లలో నాలుగింట ఒక వంతు మాత్రమే ఆసియన్లు ఉన్నారని వెల్లడించారు.మెటా ఇటీవల వైష్ణవి జయకుమార్‌తో సహా చాలా మంది ఉద్యోగులను తొలగించింది.ఆమె ఫిర్యాదుకు ప్రతీకారంగా తన తొలగింపు జరిగిందని ఆమె అభిప్రాయపడ్డారు.
మెటా తమ విధానాల్లో మార్పులు చేయాలని వైష్ణవి జయకుమార్ తన ఫిర్యాదులో కోరుతున్నారు.కాగా ఈ విషయమై మెటా ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.