విడుదలకు ముందే 10 కోట్లు నష్టం..'వారాహి యాత్ర' ప్రభావం 'బ్రో' సినిమాపై ఈ రేంజ్ లో పడుతుందా!

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ హీట్ ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి మరియు వైసీపీ ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది.

 10 Crore Loss Before The Release Will The Effect Of 'varahi Yatra' On The Movie-TeluguStop.com

పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, మరో వారం లో ఎన్నికలు జరగబోతున్నాయా అనే రేంజ్ వాతావరణం ని తీసుకొచ్చారు.ఇది ఇలా ఉండగా ఈ నెలలోనే పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’( Bro the Avatar ) గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించాడు.రీసెంట్ గానే విడుదల చేసిన టీజర్ కి అలాగే మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Telugu Crore, Pawan Kalyan, Pre Theatrical, Sai Dharam Tej, Varahi Yatra-Latest

ఆలా ప్రమోషనల్ కంటెంట్ తో మంచి అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగినట్టు తెలుస్తుంది.కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమాకి 100 కోట్ల రూపాయిల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.ప్రాంతాల వారీగా హైర్స్ ఒక రేంజ్ లో ఆఫర్స్ వచ్చాయి.అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై తీవ్రమైన విమర్శలు మరియు ఆరోపణలు చేస్తూ వచ్చాడో, అప్పటి నుండి బయ్యర్స్ ఈ సినిమాకి హైర్స్ పెట్టడానికి భయపడుతున్నారు,అందుకు కారణం ప్రభుత్వం ఈ సినిమాకి టికెట్ రేట్స్ మరియు స్పెషల్ షోస్ కి అనుమతించదు అనే భయంతోనే.

ఎందుకంటే గతం లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘వకీల్ సాబ్’ మరియు ‘భీమ్లా నాయక్ సినిమాలకు ఇలాగే చేసారు.ఆ సినిమాలకు తెలంగాణ మరియు ఓవర్సీస్ లో మంచి వసూళ్లు వచ్చినప్పటికీ,ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్స్ లేకపోవడం అతి తక్కువ వసూళ్లు నమోదు అయ్యాయని,దానికి కారణం టికెట్ రేట్స్ మరియు స్పెషల్ షోస్ లేకపోవడమే అని అంటున్నారు.

Telugu Crore, Pawan Kalyan, Pre Theatrical, Sai Dharam Tej, Varahi Yatra-Latest

ఇక బ్రో సినిమాకి గతం లో విడుదలైన రెండు పవన్ కళ్యాణ్ సినిమాలకంటే కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని,అందుకే బయ్యర్స్ హైర్స్ పెట్టడానికి భయపడుతున్నారని,ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ( Pre-release theatrical business )విడుదల లోపు తగ్గే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు.ముందు జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 100 కోట్లు కాగా, ఇప్పుడు 10 కోట్ల రూపాయిలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.అలా విడుదలకు ముందే ఇంత నష్టాలు వస్తున్నాయి అంటే, పవన్ కళ్యాణ్ కొద్దీ రోజులు వారాహి యాత్ర ని ఆపాల్సిందిగా నిర్మాతలు స్పెషల్ రిక్వెస్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది.ప్రస్తుతం రెండవ విడత వారాహి యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతుంది.

ఈ నెల 16 వ తారీఖు తో ఈ యాత్ర రెండవ దశ ముగుస్తుంది.ఆ తర్వాత ‘బ్రో’ చిత్రం విడుదల అయ్యేవరకు రాజకీయ పర్యటనలు ఉండవని సమాచారం.

మరి ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube