వెంకటేష్ ఆ సినిమాలను వదులుకుని మంచి పని చేశాడు.. లేదంటే రెండు ఫ్లాపులు?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కథల ఎంపికలో హీరోలు ఎంతో ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.ప్రేక్షకులందరికీ కూడా నచ్చే విధంగా అందరూ మెచ్చే విధంగా కథను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాలి అని కోరుకుంటూ ఉంటారు.

 How Lucky Venkatesh Didn't Accept Those 2 Projects, Venkatesh, Hero Sharwanand,-TeluguStop.com

కానీ కొన్ని కొన్ని సార్లు హీరోలు వేసిన ప్లాన్ రివర్స్ అయ్యి మంచి కథతో వచ్చినప్పటికీ అది ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడంతో డిజాస్టర్గా మిగిలిపోవటం జరుగుతూ ఉంటుంది.ఇంకా ఎంతో మంది స్టార్ హీరోలు ఇలాంటి అనుభవాలను కూడా ఎదుర్కొన్నారు.

అయితే కొన్ని కొన్నిసార్లు మాత్రం ముందుగానే ఫ్లాప్ అవుతాయి అని భావించి ఇక కథ నచ్చక తెలివిగా సినిమాలను వదులుకోవడం కూడా చేస్తుంటారు హీరోలు. విక్టరీ వెంకటేష్ విషయంలో కూడా ఇలాగే జరిగిందని తెలుస్తుంది.

 How Lucky Venkatesh Didn't Accept Those 2 Projects, Venkatesh, Hero Sharwanand,-TeluguStop.com

ఆయన చేయాల్సిన రెండు సినిమాలు వదులుకోవడం తో ఇక ఆ కథలని వేరే హీరోలు చేసి చివరికి రెండు ఫ్లాపులు ఎదుర్కొన్నారు.ఈ విషయం కాస్త ఇప్పుడు తెలిసి వెంకీ మామ ఫ్యాన్స్ అందరూ మా అభిమాన హీరోకి ఎప్పుడూ మంచే జరుగుతుంది అంటూ చెబుతున్నారు.

ఆ రెండు సినిమాలను వదులుకుని వెంకటేష్ మంచి పని చేశారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏవి అనుకుంటున్నారూ కదా.ఇటీవలే హీరో శర్వానంద్ హీరోయిన్ రష్మిక మందన కాంబినేషన్ లో వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా.ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదట ఆవరేజ్ టాక్ సొంతం చేసుకున్న చివరికి కమర్షియల్గా మాత్రం ఫ్లాప్ గానే మిగిలిపోయింది.

Telugu Adavallumeeku, Chandrasekhar, Sharwanand, Luckyvenkatesh, Radheshyam, Tol

సినిమా కథను ముందుగా వెంకటేష్ కి వినిపించారట.కానీ వెంకటేష్ వదులుకోవడంతో చివరికి శర్వానంద్ చేశాడు.ఇక పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.అయితే ఈ సినిమాను తొలుత దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి వెంకటేష్కు వినిపించగా… వెంకీ మామ నో చెప్పడం తో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది.ఇక ఆ తర్వాత ఈ కథలో కొన్ని మార్పులు చేసిన రాధా కృష్ణ కుమార్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో రాధేశ్యామ్ పేరుతో సినిమాను తెరకెక్కించారు.

భారీ బడ్జెట్ సినిమాగా వచ్చిన రాధేశ్యాం అనుకున్నంత విజయం మాత్రం సాధించలేక పోయింది అని చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube