భారతదేశంలో ట్రాఫిక్ సిగ్నల్స్( Traffic Signals ) వద్ద చాలామంది పిల్లలు ఆకలితో దీనంగా కనిపించడం మీరు గమనించే ఉంటారు.కొంతమంది నిరుపేద పిల్లలు కారు కిటికీలను తుడుస్తుంటారు.
ఆపై ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలని కోరతారు.లేదంటే కారు విండో తట్టి వస్తువులు కొనుగోలు చేయాలని పిల్లలు అడుగుతారు.
లేదా డైరెక్ట్ గా డబ్బులు యాచిస్తారు.ఇండియాలో ఈ దృశ్యాలు కనిపించడం సర్వసాధారణం.
చాలామంది వీరిని ఇగ్నోర్ చేస్తారు.మరి కొందరు దయ తలచి ఎంతో కొంత వారి చేతిలో పెడుతుంటారు.
అయితే తాజాగా ప్రముఖ మీడియా సంస్థ లూథియానా లైవ్ వ్యవస్థాపకుడు కవాల్ సింగ్ ఛబ్రా( Kawal Singh Chhabra )కి కూడా ఇలాంటి చిన్నపిల్లలు ఎదురుపడ్డారు.రూ.10 కోసం వారు ఛబ్రా కారు విండ్‌షీల్డ్‌ను శుభ్రం చేయడానికి సిద్ధమయ్యారు.అయితే వారిని చూసి జాలి పడిన కవాల్ సింగ్ ఫైవ్ స్టార్ హోటల్( Five-Star Hotel )లో తనతో భోజనం చేయమని వారిని ఆహ్వానించాడు.
దాంతో పిల్లలు ఎంతో సంతోషించి, అతని కారు ఎక్కి ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్లారు.పిజ్జా, గోల్‌గప్పేతో పాటు వివిధ రకాల వంటకాలను పిల్లలకు అక్కడి సిబ్బంది సర్వ్ చేసింది.
డెజర్ట్‌లను కూడా చిన్నారులకు అందించింది.వాటిని హాయిగా తినేస్తూ ఆహ్లాదంగా ఉన్న హోటల్‌ను సందర్శించి చిన్నారులు పులకించిపోయారు.
దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.దీనికి ఇప్పటికే లక్షల్లో లైకులు, కోట్లలో వ్యూస్ వచ్చాయి.ఛబ్రా చేసిన ఈ మంచి పనికి అపారమైన గౌరవం, ప్రశంసలు లభించాయి.ఈ హార్ట్ టచింగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.