మ‌నిషి ఎప్పుడు చ‌నిపోతాడో చెప్పేస్తున్న మిషిన్‌.. సైంటిస్టుల ట్యాలెంట్‌!

మనిషి ఆశా జీవి.ఎప్పుడూ సంతోషంగా నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటాడు.

 The Machine That Tells When A Man Dies Talent Of Scientists!, Death Time, Mechin-TeluguStop.com

కానీ ఎవరూ మరణాన్ని కోరుకోరు.అయితే కొందరికి మాత్రం తమ మరణం ఎప్పుడో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది.

అలాంటి వారి కోరికను నిజం చేయాడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రస్తుతం ఇది కొన్ని చోట్ల అందుబాటులోకి వచ్చింది.

ప్రపంచం నలుమూలలకు అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నది.దీని కోసం ఒక ప్రత్యేక యంత్రాన్ని శాష్ట్రవేత్తలు తయారు చేశారు.

దీని ప్రత్యేకత ఏంటంటే దీని ద్వారా ఒక మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలుసుకోవచ్చట.

ఎవరికైతే తమ మరణాన్ని ముందే తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్​ ఉంటుందో వారు ఈ యంత్రం ద్వారా ముందే దానిని ముందే తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దీనిపై దాదాపు ఎనిమిదేళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి.నాలుగేళ్ల క్రితం ఇది అందుబాటులోకి వచ్చింది.ఇందులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సగం మంది వృద్ధుల డాటా అందుబాటులో ఉంది.ఈ డేటా ద్వారా ఈ యంత్రం అనాలసిస్​ చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దీనిని తయారు చేసే క్రమంలో చాలా మంది తమ హెల్త్​కు సంబంధించి వివరాలు అందించారని శాస్త్రవేత్తలు చెప్పారు.దానిని బట్టి వారికి వచ్చే వ్యాధులు, మరణించే సమయం, అప్పుడు వచ్చే లక్షణాలు చెప్పిందని తెలిపారు.

అవి దాదాపు సరిపోలాయని చెప్పారు.ఇది ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తే ఎంత మంది దీనిని పరీక్షిస్తారో ఇంకా వెయిట్​ చేయాల్సిందే.అయితే మరణాన్ని ముందే తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందా ? అలా తెలుసుకోవడం వల్ల ఏమోస్తుందని మీరు అనుకుంటున్నారా ? దీనిపై కూడా భిన్న వాదనలు ఉన్నాయి.అందులో ఒకటి.

మరణాన్ని ముందే తెలుసుకోవడం వల్ల కొందరు ఆందోళన చెంది.ఉన్నన్ని రోజులు కూడా ప్రశాంతంగా ఉండలేరు.

ఆ ఆందోళన వల్ల ముందే మరణించే అవకాశం కూడా ఉంటుంది.ఇంకో అంశం ఏంటంటే.

మరణం ముందే తెలియడం వల్ల అందరితో కలివిడిగా ఉంటారు.చేరాల్సిన లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నిస్తారు.

అడ్డదారుల్లో డబ్బు సంపాదించకుండా నిజాయితీగా బతుకుతారు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube