శ్రీశైలం ఆలయం రాజగోపురం వద్దకు చేరుకున్న కిషన్ రెడ్డి దంపతులకు

శ్రీశైలం దేవస్దానం అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీశైలం దేవస్దానం అభివృద్ధి చెందాలసిన అవసరం ఉందని కేంద్ర సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి శ్రీశైలంలో మీడియాతో మాట్లాడారు ముందుగా శ్రీశైలం ఆలయం రాజగోపురం వద్దకు చేరుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులకు ఆలయ ఈఓ లవన్న అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో నుదిటిన విభుది ధారణ చేసి స్వాగతం పలికారు అనంతర కిషన్ రెడ్డి దంపతులు రాజగోపురం వద్ద ఉన్న ద్వజస్దంభానికి నమస్కరించి మల్లికార్జునస్వామి వారికి రుద్రాభిషేకం భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి ఆశీర్వాచన మండపంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులకు ఈఓ లవన్న స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించగా అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా ఆశీర్వచనలిచ్చి తీర్ధప్రసాదాలను స్వామిఅమ్మవార్ల చిత్రపటాన్ని అందించారు .అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీశైలం దర్శనం కోసం రానున్నట్లు తెలిపారు అంతేకాకుండా శ్రీశైలంలో నరేంద్ర మోడి ఆదేశాలతో కేంద్రప్రభుత్వం తరుపున 43 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని వచ్చే నెలలో భక్తుల సౌకర్యాల కోసం ఓపనింగ్ లు చేసి భక్తులకు అంకితం చేస్తామని అన్నారు .

 The Kishan Reddy Couple Reached The Srisailam Temple Rajagopuram , Kishan Reddy-TeluguStop.com

సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా క్యాబినెట్ మినిస్టర్ గా భాద్యతలు తీసుకున్న తరువాత మొదటిసారిగా శ్రీశైలం భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube