బిడ్డను గాలిలో లేపుతూ తల్లిని ప్రాంక్ చేసిన తండ్రి.. హిలేరియస్ వీడియో వైరల్..

సోషల్ మీడియాలో( Social media ) చాలా ఫన్నీ వీడియోలు వైరల్( Viral video ) అవుతుంటాయి.వాటిలో ప్రాంక్ వీడియోలు మనల్ని బాగా ఆకట్టుకుంటాయి.

 The Father Pranked The Mother By Raising The Child In The Airhilarious Video Vir-TeluguStop.com

తాజాగా ఆ తరహా వీడియో ఒకటి ట్విట్టర్‌లో విస్తృతంగా వైరల్ అవుతుంది.

ప్రముఖ ట్విట్టర్ హ్యాండిల్ సీసీటీవీ ఇడియట్స్ షేర్ చేసిన ఆ వీడియోలో ఒక తల్లి అరేంజ్మెంట్స్ చేయడం మనం గమనించవచ్చు.ఏదో పార్టీ కోసం ఆమె గాల్లో ఎగిరే హీలియం బెలూన్స్ కూడా ఆమె తెచ్చుకుంది.ఆ తర్వాత పనిలో పడిపోయింది.

ఇంతలోనే ఆమెకు ఏదో తేడాగా అనిపించింది.వెంటనే తన బిడ్డను చెక్ చేయగా ఆ పిల్ల హీలియం బెలూన్స్ పట్టుకొని కనిపించింది.

అంతేకాదు ఆ బెలూన్స్( Helium balloons )కారణంగా ఆమె పైకి లేస్తున్నట్టుగా అనిపించింది.

దాన్ని చూసి ఒక్కసారిగా తల్లి షాక్ అయింది.అయ్యో అనుకుంటూ, వెంటనే కాపాడడానికి పరిగెత్తింది.బిడ్డ పైకి వెళ్లి కింద పడితే ప్రమాదం ఏదైనా జరుగుతుందేమో అని చాలా భయపడిపోయింది.

అప్పుడే అసలైన ట్విస్ట్ బయటపడింది.అదేంటంటే, ఆ చిన్నారిని బెలూన్స్ కాదు కానీ తండ్రి వెనక ఉండి లేపుతున్నాడు.

ఆ చిన్నారి డ్రెస్ లోపల చెయ్యి పెట్టి మన చేతులు తల్లికి కనిపించకుండా అతను పైకి లేపాడు.అందువల్ల చిన్నారి బెలూన్స్ కారణంగా పైకి వెళ్తుందేమో అని తల్లి పొరపాటు పడింది.

తర్వాత అసలు సంగతి తెలిసి ఆ తండ్రిపై కాస్త చిరుబురు లాడింది.చివరికి నవ్వేసింది.

ఈ వీడియోకు ఇప్పటికే 70 వేలకు పైగా లైక్స్ వచ్చాయి దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube