వీడియో: పెళ్లిలో బుల్లెట్లు కాలుస్తూ సెలబ్రేషన్స్.. మిస్‌ఫైర్ కావడంతో ఒకరు స్పాట్‌డెడ్..

వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో( Wedding Celebrations ) గన్ ఫైర్ చేస్తూ కలకలం రేపిన సంఘటనలు ఇప్పటికే ఎన్నో వెలుగులోకి వచ్చాయి.గన్ ఫైర్‌తో సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా హానికరం ఎందుకంటే మిస్ ఫైర్ అయితే శుభకార్యం కాస్త చావు మేళంగా మారుతుంది.

 The Fatal Consequence Of Celebratory Gunfire At A Jordanian Wedding Video Viral-TeluguStop.com

సరిగ్గా ఇదే జోర్డాన్‌లోని( Jordan ) ఒక పెళ్లి వేడుకలు జరిగింది.ఇది ఎప్పుడు జరిగిందో తెలియ రాలేదు కానీ ప్రస్తుతం ఈ తుపాకీ మిస్‌ఫైర్‌కు( Gun Misfire ) సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

@Githii ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే రెండు లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.ఇదే పేజీ ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం అందించింది.

ఆ పేజీ ప్రకారం, జోర్డాన్‌లోని మాన్‌లో పోలీస్‌గా పనిచేసిన వరుడు హమ్జే అల్ ఫనాత్సే( Hamzeh Al Fanatseh ) గన్ ఫైర్ లో ప్రాణాలు కోల్పోయాడు.తన వివాహ వేడుకలో హృదయ విదారక సంఘటన జరిగింది.

అతని మరణానికి కారణం సెలబ్రేటరీ గన్‌ఫైర్‌గా( Celebratory Gunfire ) పని పోలీసులను నిర్ధారించారు.హమ్జే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మాన్‌లో పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు.

ఈ విషాదానికి ప్రతిస్పందనగా, ప్రాణాంతకమైన షాట్‌కు కారణమైన వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు.పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టరేట్ ప్రస్తుతం ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేస్తోంది.

పీఎస్‌డీ అధికారి ఫనత్సేను కోల్పోవడం పట్ల బహిరంగంగా విచారం వ్యక్తం చేశారు.ఈ ప్రమాదకరమైన తుపాకీ కాల్పుల సంప్రదాయాన్ని ఆపాలని ప్రజలకు బలమైన విజ్ఞప్తిని కూడా జారీ చేశారు.ఘటన జరిగిన సమయంలో వధువు సెలూన్‌లో ఉంది.ఆమెకు అక్కడ వినాశకరమైన వార్త అందింది, అది ఆమెకు అపారమైన దుఃఖాన్ని కలిగించడమే కాకుండా విస్తృతమైన సంతాపానికి దారితీసింది.

భవిష్యత్‌లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉత్సవాల్లో బాధ్యతా రహితంగా మారణాయుధాలు వాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సమాజం కోరుతోంది.అయితే వైరల్ వీడియో చూస్తుంటే సదరు వ్యక్తి కావాలనే వరుడు వైపు గురిపెట్టి కాల్చినట్లుగా అనిపిస్తోంది.ఆ హంతకుడికి వరుడు పై ఏమైనా పగ ఉందా అనే డౌట్‌ను చాలామంది నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube