బెట్టింగ్‌ యాప్‌లకు కేంద్ర ప్రభుత్వం షాక్.. వాటిని ప్రోత్సహించే వారికి హెచ్చరిక

ఐపీఎల్( IPL ) ప్రారంభం అయింది.దీంతో బెట్టింగ్ వేసే వారి కోసం కొత్త కొత్త యాప్‌లు పుట్టుకొచ్చాయి.

 The Central Government Is Shocked By The Betting Apps Warning To Those Who Promo-TeluguStop.com

ఇవే కాకుండా తీన్ పట్టీ, సాకర్ గేమ్స్( Teen Patti, soccer game ) ఆడాలంటూ ఆకర్షిస్తున్నాయి.కొన్ని మీడియా సంస్థలు సైతం వాటిని ప్రసారం చేస్తూ ప్రోత్సహిస్తున్నాయి.

బెట్టింగ్ యాప్‌లో చాలా మొత్తంలో పోగొట్టుకుని పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.దీనిని గమనించిన కేంద్ర ప్రభుత్వం ( Central Govt )గురువారం కీలక ప్రకటన చేసింది.

మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ఆన్‌లైన్ గేమింగ్ కోసం కొత్త నిబంధనలను విడుదల అయ్యాయి.బెట్టింగ్,

Telugu Apps, Central, Soccer Game, Teen Patti-Latest News - Telugu

ఇతర పందేలు ఏవైనా ప్రోత్సహించే గేమ్స్‌పై నిషేధం విధించింది.కొత్త నిబంధనల ప్రకారం బెట్టింగ్, డబ్బు పెట్టే పందేలు ఇక నిషిద్ధం.బహుళ స్వీయ-నియంత్రణ సంస్థల (ఎస్‌ఆర్ఓ) ఫ్రేమ్‌వర్క్‌ను కలిగి ఉంటుంది.

ఏదైనా గేమ్‌లు పందెం వేస్తున్నాయా అనే దాని ఆధారంగా ఆన్‌లైన్ గేమ్‌లను అవి పర్యవేక్షిస్తాయి.అంతేకాకుండా అవి అనుమతించదగినవా, కావా అని ప్రకటించడానికి ఈ ఎస్‌ఆర్ఓలు బాధ్యత వహిస్తాయి.

Telugu Apps, Central, Soccer Game, Teen Patti-Latest News - Telugu

కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ దీనిపై మాట్లాడారు.డబ్బుతో ముడిపడి ఉన్న ఏదైనా ఆన్‌లైన్ గేమ్‌లో బెట్టింగ్స్ సాగుతుంటే వాటికి అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేశారు.ఆన్‌లైన్ గేమింగ్ కోసం మార్గదర్శకాలను జారీ చేసినట్లు వివరించారు.నిబంధనలను మరింత కఠినంగా రూపొందించనున్నట్లు చెప్పారు.ఆన్‌లైన్ గేమ్ ఆడే క్రమంలో కేవైసీ ప్రమాణాలకు అనుగుణంగా కార్యకలాపాలు ఉండాలన్నారు.దీనిపై ఎస్ఆర్ఓలు పని చేస్తున్నాయని వివరించారు.

ఇక ప్రధాన స్రవంతిలోని ఇంగ్లీష్, హిందీ వార్తా పత్రికలు, వెబ్‌సైట్లు, టీవీ ఛానెళ్లు, ఆన్‌లైన్ న్యూస్ వెబ్‌సైట్లు బెట్టింగ్ యాప్స్‌ను ప్రోత్సహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.బెట్టింగ్ నిరోధించేందుకు మీడియా కూడా తగిన సహకారం అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube