బర్త్ డే కానుకగా బ్లాస్టింగ్ పోస్టర్ తో వచ్చిన 'ఏజెంట్'!

అక్కినేని యువ హీరోల్లో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఒకరు.ఈ రోజు ఈ యంగ్ హీరో పుట్టిన రోజు జరుపు కుంటున్నారు.

 Akhil Literally Sets Screens On Fire In Agent's B'day Poster, Akhil Akkineni, Sa-TeluguStop.com

మరి ఈయన బర్త్ డే (Akhil Akkineni Birthday) సందర్భంగా ప్రముఖులు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విషెష్ చెబుతూ సందడి చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ రోజు ఈయన పుట్టిన రోజు సందర్భంగా ఈయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ నుండి అదిరిపోయే బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చింది.

ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో ”ఏజెంట్” (Agent Movie) సినిమాను చేస్తున్నాడు.యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ మునుపెన్నడూ లేని విధంగా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.

ఈ సినిమా కోసమే అఖిల్ మరో సినిమాను ఒప్పుకోకుండా రెండేళ్లుగా ఒకే సినిమాకు పరిమితం అయ్యాడు.రెండుళ్లుగా అనేక వాయిదాల నేపథ్యంలో ఈ సినిమా షూట్ ఇంత ఆలస్యం అవుతూ వచ్చింది.

అయితే ఎట్టకేలకు ఈ నెలతో ఈ సినిమా వాయిదాల పర్వం ముగియనుంది.ఎందుకంటే ఈ నెలలోనే సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ బాగానే ఆకట్టు కున్నాయి.ఇక ఈ రోజు అఖిల్ బర్త్ డే కానుకగా బ్లాస్టింగ్ పోస్టర్ ను ఇచ్చారు మేకర్స్.

ఈ పోస్టర్ లో అఖిల్ గన్ పట్టుకుని నిలబడి ఉండగా బ్యాక్గ్రౌండ్ లో ఒక ఫైర్ కనిపిస్తుంది.

ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది.ఇదిలా ఉండగా ఈ సినిమాను సురేందర్ 2 సినిమాస్ తో కలిసి ఏకే ఎంటెర్టాన్మెంట్స్ (AK Entertainments) బ్యానర్ పై అనిల్ సుంకర ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించ నుండగా.

ఈయనకు జోడీగా సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే కీలక పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) నటిస్తున్నాడు.

అలాగే హిప్ హప్ తమిజా సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube