ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు లండన్ నగరంలోని హౌన్స్ సిటీలో ఎన్ఆర్ఐ టిడిపి యూకే ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా, వైభవంగా నిర్వహించారు.ఎన్ఆర్ఐ టిడిపి యు కె ప్రెసిడెంట్ పోపూరి వేణు మాధవ్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసినట్లు వెల్లడించారు.
కోవెంట్రీ పట్టణంలో యూకే టీ డీపీ వైస్ ప్రెసిడెంట్ చక్రి మొవ్వా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినా నారా లోకేష్ కి జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈనెల 27 న ప్రారంభం కాబోతున్న యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ సంఘీభావంగా ఎన్నారై టిడిపి యూకే వర్గాలు నగరంలో పాదయాత్ర నిర్వహించాయి.
ఆ తర్వాత సభా కార్యక్రమాన్ని నిర్వహించారు.సభా ప్రాంగణంలో సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో మార్మోగిపోయింది.ఈ కార్యక్రమంలో చాలా మంది ఎన్నారై టిడిపి కార్యకర్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో కురుకుపోయిన అందాకారం తొలగిపోయి అభివృద్ధి పాటలో నడవాలంటే చంద్రబాబు మళ్ళీ సీఎం అవ్వాలని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని వెల్లడించారు.
ఈ కార్యక్రమం లో టిడిపి యు కె నేతలు శ్రీ కిరణ్ పరచురి, ప్రసన్న నాదెండ్ల, సురేష్ కోరం, శ్రీనివాస్ పాలడుగు, నవీన్ జవ్వాడి, సుందర్ రాజు మల్లవరపు, మేరి కల్పన, భాస్కర్ అమ్మినేని, అమర్నాథ్ మన్నే, కుమార్ నిట్టల, లింగ రవితేజ, వంశీ నాగళ్ళ, బాల కృష్ణ పోలినేని ఇంకా ఎంతో మంది ఎన్నారై టిడిపి కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.