కోలీవుడ్ నటుడు ఆది పినిశెట్టి నటి నిక్కీ గల్రానీ మే నెలలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరు కలిసి యగవరయినమ్ నా క్కక, మరగద నానయమ్ చిత్రాల్లో నటించారు.
అదే సమయంలో వీరిద్దరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది ఇలా కొద్దిరోజులపాటు ప్రేమలో ప్రేమ పక్షుల విహరించినటువంటి ఈ జంట పెద్దల సమక్షంలో వీరి ప్రేమ విషయాన్ని తెలియజేస్తూ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ప్రస్తుతం ఈ దంపతులు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉండగా వీరి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల గురించి ఏదో ఒక వార్త వైరల్ కావడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే ఈ దంపతులకు పెళ్లి కావడంతో త్వరలోనే వీరిద్దరూ వారి కుటుంబంలోకి మరొక అతిధిని ఆహ్వానించబోతున్నారని, త్వరలోనే ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
ఇక ఈ విషయం వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు నటి నిక్కీ గల్రానీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా వీరి గురించి ఇలాంటి వార్త రావడంతో ఈ వార్తలపై నిక్కీ గల్రానీ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.ట్విట్టర్ వేదికగా ఈమె స్పందిస్తూ.తాను ప్రెగ్నెంట్ అనే వార్తలను సృష్టించిన మీరే తన డెలివరీ డేట్ కూడా చెప్పేయండి అంటూ తన ప్రెగ్నెన్సీ రూమర్లపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
తాను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఎవరు కూడా ఈ వార్తలను నమ్మకండి అంటూ తెలియజేశారు.భవిష్యత్తులో తప్పకుండా ప్రెగ్నెంట్ అవుతానని అదే సమయంలో ఆ విషయాన్ని అందరికీ తెలియజేస్తాను అంటూ చెప్పుకొచ్చారు.
ఈ విధంగా ప్రెగ్నెన్సీ రూమర్లపై స్పందించిన నిక్కీ గల్రానీ అందులో నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చారు.