అమెరికాలో ప్రతిష్టాత్మక కంపెనీకి...సీఈవో గా..ఇండో అమెరికన్

భారత సంతతికి చెందిన రాజేష్ సుబ్రమణ్యం అనే వ్యక్తి అమెరికా లో అతిపెద్ద కొరియర్ కంపెనీగా పేరొందిన “ఫెడెక్స్ ఎక్స్ ప్రెస్” కి సీఈవోగా ఎంపిక అయ్యారు.అయితే రాజేష్ అదే కంపెనీకి ఇప్పుడు చీఫ్ మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్స్ ఆఫీసర్ గా ఉన్నతమైన పదవులలోనే ఉన్నారు.

 Fedex Express New Ceo Is A Nri-TeluguStop.com

అయితే తాజాగా సంస్థ తీసుకున్న నిర్ణయంతో సీఈవో గా ఎంపిక అయ్యారు.

జనవరి 1 నుంచీ ఆయన తన కొత్త పదవీ భాద్యతలు చేపడతారని తెలిపారు.సుబ్రమణ్యం కేరళలోని తిరువనంతపురంలో పుట్టారు… బాంబే ఐఐటీ నుంచి పట్టా పొందిన తరువాత .న్యూయార్క్ లోని సాయరాక్యూజ్ యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్ డిగ్రీ పొందారు.ఆ తరువాత టెక్సాస్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు.

రాజేష్ దాదాపు 27 ఏళ్ల నుంచి ఫెడెక్స్ లో పని చేస్తూ వస్తున్నారు.ఈ క్రమంలోనే అనేక ఉన్నత పదవులని అలంకరిస్తూ వచ్చారు.గత ఏడాది ఆయన ఫెడెక్స్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్ ఆఫీసర్ గా ఎన్నికయిన ఆయన ఈ ఏడాది సీఈవో స్థాయికి చేరుకోవడం భారతీయులకి ఎంతో గర్వకారణమనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube