ప్రముఖ 'బిజినెస్ స్కూల్'లో సీటు సంపాదించిన సీఎం జగన్ కుమార్తె!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షారెడ్డి ప్రపంచంలోనే ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్లో సీటు సాధించారు.ఇప్పటికే ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్షారెడ్డి ఇప్పుడు టాప్ బిజినెస్ స్కూల్ లో సీటు సంపాదించడంతో సీఎం జగన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 Ap Cm Ys Jagan Mohan Reddy, Elder Daughter Joins America Business School,ap Cm Y-TeluguStop.com

తండ్రికి తగ్గ కూతురుగా హర్ష రెడ్డి పేరు సంపాదించారని అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.ఆమె ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్లో సీటు సంపాదించడంతో రేపు హర్ష రెడ్డిని పంపేందుకు సీఎం జగన్ బెంగుళూరు వెళ్లనున్నారు.

అయితే ఈ విషయాన్నీ సీఎం జగన్ అభిమానులు ట్విట్టర్ వేదికగా తెలిపి ప్రశంసిస్తున్నారు.

కాగా సీఎం జగన్ చిన్న కుమార్తె వర్షా రెడ్డి కూడా అమెరికా ఇండియాన్ స్టేట్‌లోని ప్రతిష్ఠాత్మక నోట్రే డామ్ యూనివర్శిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతోంది.

దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ కూతుళ్లను ప్రశంసిస్తున్నారు.తండ్రికి తగ్గ కూతుర్లుగా వారు నిరూపించుకున్నట్టు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube