పలు తెలుగు చిత్రాలలో హీరో తల్లి పాత్రలలో నటించి సినీ ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “రూప లక్ష్మి” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే రూప లక్ష్మి ఆ మధ్య తెలుగులో శ్రీ విష్ణు హీరోగా నటించిన “నీది నాది ఒకటే కథ” చిత్రంలో హీరో తల్లి పాత్రలో నటించి డైలాగులు, కామెడీ పంచులతో ప్రేక్షకులను బాగా అలరించింది.
తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి నటి రూప లక్ష్మి ప్రేక్షకులతో పంచుతుంది.
ఇందులో భాగంగా తన తల్లిదండ్రులు చిన్నప్పుడు వ్యవసాయం చేసేవారని దాంతో కొంతకాలం తర్వాతనష్టాల కారణంగా కుటుంబ పోషణ భారమైందని చెప్పుకొచ్చింది.
దీంతో తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వేరే వాళ్ళకి తనని దత్తత ఇచ్చారని కానీ ఈ విషయం తన మొత్తం జీవితాన్ని మార్చేసిందని తెలిపింది.అయితే తనని దత్తత తీసుకున్న తండ్రి బాగానే చూసుకున్నప్పటికి తన ఇంట్లో ఉన్నటువంటి ఇతర కుటుంబ సభ్యులు మాత్రం తనని తమ కుటుంబ సభ్యురాలిగా అంగీకరించలేక పోయారని దాంతో చిన్నప్పటినుంచే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది.
కొంత కాలం తర్వాత ఇరుగుపొరుగు వాళ్ళు ద్వారా తన నిజమైన తల్లిదండ్రులు వేరే ఉన్నారని తెలియడంతో వారి దగ్గరికి వెళ్లి పోయానని, దీంతో ఇటు తన తోడబుట్టిన వాళ్లకి దగ్గర కాలేకపోయానని, అటు పెంచుకున్న వాళ్ళకి దగ్గర కాలేకపోయానని ఎమోషనల్ అయ్యింది.తాను మూడవ తరగతి చదువుతున్నప్పుడే తనని దత్తత ఇవ్వడంతో అప్పటి వరకు బాగానే చదువుతున్న తను అనుకోకుండా పలు సమస్యలతో విసిగిపోయానని అందువల్లనే పెద్దగా చదువుకోలేదని చెప్పుకొచ్చింది.
ఈ విషయం ఇలా ఉండగా నటి రూప లక్ష్మి తెలుగులో దాదాపుగా 50 కి పైగా చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించింది.అంతేకాక అప్పట్లో పలు బుల్లితెర ధారావాహికలలో కూడా నటించి, ఇటు బుల్లితెరపై కూడా బాగానే అలరించింది.
ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల సీరియళ్లలో నటించడం లేదు.