తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికలలో జనసేన కూడా పోటీ చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించటం తెలిసిందే.నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభం కాకముందు తెలంగాణ జనసేన నేతలతో సమావేశం అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంతేగాని తెలంగాణలో కూడా వారాహి యాత్ర చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.అనంతరం తెలంగాణ రాష్ట్రంలో 32 నియోజకవర్గాలలో జనసేన పోటీ చేస్తుందని లిస్టు విడుదల చేశారు.
కూకట్పల్లి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, సనత్‌నగర్, ఉప్పల్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజూర్నగర్, మునుగోడు, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, ఖానాపూర్, పాలేరు, ఇల్లందు, మధిర స్థానాల్లో పోటీ చేయనున్నట్లు జనసేన తెలిపింది.ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జ్ శంకర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో జరగబోయే ఎన్నికలలో 32 స్థానాలలోనే కాకుండా మరిన్ని నియోజకవర్గాలలో జనసేన పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.చాలామంది యువత, మేధావులు, జనసేన టికెట్లు ఆశిస్తున్నారని, పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు.
తెలంగాణలో ఇన్నేళ్లు ఇతర పార్టీలకు మద్దతు తెలిపిన ప్రజలు ఈసారి జనసేన పార్టీని గెలిపించాలని కోరారు.