తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3124 పోస్టులకు గ్రీన్ సిగ్నల్..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana Government ) వరుసగా నోటిఫికేషన్ లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.గత ఏడాది బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలలో సీఎం కేసీఆర్( CM KCR ) లక్ష ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు హామీ ఇచ్చారు.

 Telangana Government Green Signal For 3124 Posts In Telangana Vaidya Vidhana Par-TeluguStop.com

ఆ రీతిగానే ప్రభుత్వ రంగాలలో ఖాళీగా ఉన్న స్థానాలకు సంబంధించి భర్తీ చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంది.దాదాపు ఏడాది నుండి ఇప్పటివరకు చాలా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ వైద్య విధాన పరిషత్( Telangana Vaidya Vidhana Parishad ) పరిధిలోని ఆసుపత్రులలో 3124 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేయడం జరిగింది.ఈ క్రమంలో 2029 అవుట్ సోర్సింగ్, 968 పోస్టులను కాంట్రాక్ట్, 127 పోస్టులను ఎంటిఎస్ పద్ధతిలో భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయింది.సెక్యూరిటీ గార్డు నుంచి సివిల్ అసిస్టెంట్ సర్జన్ వరకు పలు విభాగాల పోస్టులను ఏడాది కాల పరిమితితో నియమించనున్నారు.ఈ నోటిఫికేషన్ కి సంబంధించి త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరుస పెట్టి నోటిఫికేషన్ లు( Govt Job Notification ) విడుదల చేస్తూ ఉండటంతో.నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube