తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.గురువారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో రాష్ట్ర రోడ్డు,భవనాల శాఖా మంత్రి తాటిశెట్టి రాజా, టీడీపీ ఎమ్మెల్సీ రామరావులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన టిడిపి ఎమ్మెల్సీ రామారావు మీడియాతో మాట్లాడుతూ.
ప్రజా శ్రేయస్సు కోసం యువ నాయకుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేపట్టారని, నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టడం సాహసోపేత నిర్ణయంమని కొనియాడారు.యాత్ర దిగ్విజయం కావాలని శ్రీవారిని కోరుకున్నట్లు ఆయన చెప్పారు.
పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని, అనుమతులు ఇచ్చామంటారు మళ్ళీ అడ్డుకుంటారని, ఎన్ని అడ్డంకులు వచ్చిన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేస్తాంమని ఆయన అన్నారు.