యువతకు బోగస్ హామీలు ఇచ్చి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు.. బోండా ఉమా

విజయవాడ, సింగ్ నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయం సమీపంలోని “షాదీ ఖానా లో” విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగు యువత నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సవ సభ జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు,Ex.

 Tdp Bonda Uma Fires On Ap Cm Jagan Mohan Reddy Details, Tdp Bonda Uma , Ap Cm Ja-TeluguStop.com

MLA బోండా ఉమామహేశ్వరరావు గారు పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా బోండా ఉమా మాట్లాడుతూ యువతకు బోగస్ హామీలు ఇచ్చి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు అని, అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు మరిచి యువతకు ఉపాధి లేకుండా చేసారు అని మండిపడ్డారు.

అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన మాట మర్చిపోయారా అని ప్రశ్నించారు.తూతూ మంత్రంగా 10వేల ఉద్యోగాలతో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు అన్నారు.

ఏటా పోలీస్ ఉద్యోగాలు విడుదల చేస్తాం అని మోసం చేశారు అన్నారు.నిరుద్యోగులకు గత ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నాం అని, ఆ పథకాన్ని కూడా రద్దు చేసిన ఘనత ఈ జగన్ రెడ్డిది అన్నారు.

యువత ఉపాధి కోల్పోయి 3సంవత్సరాలు అవుతుంది అన్నారు.టీడీపి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోని ఐటీ కంపెనీలకు, ఇండస్ట్రీల ను రాష్ట్రానికి తీసుకురావడం తో ఏటా యువతకు ఉపాధి కలిగేది అన్నారు.

కానీ ఈ జగన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న కంపెనీలను కూడా తరిమెస్తున్నరు అని మండిపడ్డారు.

పక్క రాష్ట్రాలలో పెద్ద పెద్ద కంపెనీలు వస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం రొయ్యలు, చేపలు షాపులు పెట్టి యువతను తప్పు దారి పట్టిస్తున్నారు అన్నారు.

ఈ రాష్ట్రంలో యువత కు న్యాయం జరిగే వరకూ ప్రతిపక్ష పార్టీగా పోరాడుతూ ఉంటాం అని, రాబోయే ఎన్నికల్లో యువతే ఈ వైసీపీ కి తగిన బుద్ధి చెబుతారు అని అన్నారు.

అనంతరం సెంట్రల్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడుగా కంచి ధన శేకర్, ప్రధాన కార్యదర్శిగా బూదాల సురేష్ లతో పాటు 120 మందితో తెలుగు యువత కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, TNTUC రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, టీడీపి ఫ్లోర్ లీడర్ నేలిబండ్ల బాలస్వామి, కార్పొరేటర్ కంచి దుర్గ, మాజీ ఫ్లోర్ లీడర్ ఎరూబోతు రమణ, tntuc రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్, నేతలు తుమ్మలపెంట శ్రీనివాస్, కాకు మల్లికార్జున యాదవ్ ఇప్పిలి మోహన్, దాసరి ఉదయశ్రీ, గరిమెళ్ళ చిన్న, శంకర మనోజ్, అలా రామారావు, పీరియా సోమేశ్వర రావు, చింతల మధు, బెజ్జం జైపాల్, లబ్బ దుర్గ, శ్రీనివాస గుప్త తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube