ఎన్నారై విద్యార్ధులకి...తానా “స్కాలర్ షిప్” లు

తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) అమెరికాలో చదువుకునే తెలుగు విద్యార్ధులకి సమవంతు సాయంగా.స్కాలర్ షిప్‌లని అందిస్తోంది.ఎన్నో ఆశలతో అమెరికాలో చదువుకోవాలని వచ్చే విద్యార్ధులు డబ్బు అందకపోవడంతో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్ర్రమం నిర్వహిస్తున్నమాని తెలిపారు.2018-19 లో డిగ్రీ చదువుతున్న విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్ లకి దరఖాస్తులను తానా ఆహ్వానిస్తోంది.చదువుకునే సామర్థ్యం ఉండి.ఆర్థిక స్థోమత లేని వారిని తానా ఈ రూపంలో ఆదుకుంటోంది.

 Tana Foundation American Education-TeluguStop.com

అయితే మొత్తం ఏడూ రకాలుగా తానా ఈ స్కాలర్ షిప్‌లని అందిస్తోంది.గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్‌ల రూపంలో ప్రతీ విద్యార్థికి 2000 డాలర్లను అందించాలని తానా ప్రతినిధులు నిర్ణయించారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన తెలుగువారు ఎవరైనా ఈ స్కాలర్ షిప్‌లను పొందవచ్చని వారు చెప్పారు.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థులు ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

వారు చదువుకునే పద్దతులలో సెమిస్టర్ లు ఉంటే వాటికి ఒక్కో సెమిస్టర్ కి 500 డాలర్ల చొప్పున మొత్తం నాలుగు సెమిస్టర్లకు స్కాలర్‌షిప్ అందించనున్నారు.అయితే అమెరికాలోనే హైస్కూల్ చదువుని పూర్తీ చేసిన వారికి మాత్రం నాలుగు రకాలుగా ఈ స్కాలర్ షిప్‌ల ని అందించనున్నారు.

వీరిలో ఒక్కొక్కరికి 1000 డాలర్లను స్కాలర్ షిప్‌గా ఇవ్వనున్నట్టుగా తానా సభ్యులు తెలిపారు.అయితే తానా చేస్తున్న ఈ మంచి పనికి విద్యార్ధులకి చేయూత నిస్తున్న తానా కి తెలుగు సంఘాలు అన్నీ కృతజ్ఞతలు తెలిపాయి.

ఈ స్కాలర్ షిప్‌ల విషయంలో మరిన్ని వివరాలు తెలియాలి అంటే

నిరంజన్ శృంగవరపు,

చైర్మెన్ తానా ఫౌండేషన్

2483426872

[email protected]

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube