ఎన్నారై విద్యార్ధులకి...తానా “స్కాలర్ షిప్” లు
TeluguStop.com
తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) అమెరికాలో చదువుకునే తెలుగు విద్యార్ధులకి సమవంతు సాయంగా.
స్కాలర్ షిప్‌లని అందిస్తోంది.ఎన్నో ఆశలతో అమెరికాలో చదువుకోవాలని వచ్చే విద్యార్ధులు డబ్బు అందకపోవడంతో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్ర్రమం నిర్వహిస్తున్నమాని తెలిపారు.
2018-19 లో డిగ్రీ చదువుతున్న విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్ లకి దరఖాస్తులను తానా ఆహ్వానిస్తోంది.
చదువుకునే సామర్థ్యం ఉండి.ఆర్థిక స్థోమత లేని వారిని తానా ఈ రూపంలో ఆదుకుంటోంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అయితే మొత్తం ఏడూ రకాలుగా తానా ఈ స్కాలర్ షిప్‌లని అందిస్తోంది.
గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్‌ల రూపంలో ప్రతీ విద్యార్థికి 2000 డాలర్లను అందించాలని తానా ప్రతినిధులు నిర్ణయించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన తెలుగువారు ఎవరైనా ఈ స్కాలర్ షిప్‌లను పొందవచ్చని వారు చెప్పారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థులు ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు.
!--nextpage
వారు చదువుకునే పద్దతులలో సెమిస్టర్ లు ఉంటే వాటికి ఒక్కో సెమిస్టర్ కి 500 డాలర్ల చొప్పున మొత్తం నాలుగు సెమిస్టర్లకు స్కాలర్‌షిప్ అందించనున్నారు.
అయితే అమెరికాలోనే హైస్కూల్ చదువుని పూర్తీ చేసిన వారికి మాత్రం నాలుగు రకాలుగా ఈ స్కాలర్ షిప్‌ల ని అందించనున్నారు.
వీరిలో ఒక్కొక్కరికి 1000 డాలర్లను స్కాలర్ షిప్‌గా ఇవ్వనున్నట్టుగా తానా సభ్యులు తెలిపారు.
అయితే తానా చేస్తున్న ఈ మంచి పనికి విద్యార్ధులకి చేయూత నిస్తున్న తానా కి తెలుగు సంఘాలు అన్నీ కృతజ్ఞతలు తెలిపాయి.
ఈ స్కాలర్ షిప్‌ల విషయంలో మరిన్ని వివరాలు తెలియాలి అంటే
నిరంజన్ శృంగవరపు,
చైర్మెన్ తానా ఫౌండేషన్
2483426872
Chairman@tanafoundation!--org .
తెలంగాణలో మోగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్