తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్వామీజీలపై తీవ్రంగా మండిపడ్డారు.తన తలను తెస్తే రూ.10 కోట్లని ప్రకటించారన్న ఆయన తన తల కోసం ఎవరు వస్తారో చూస్తానని చెప్పారు.
గతంలోనూ కరుణానిధిపై రూ.కోటి ప్రకటించారన్న ఉదయనిధి స్టాలిన్ కరుణానిధి తరహాలోనే తాను కూడా ఎవరికీ భయపడేది లేదని తేల్చి చెప్పారు.స్వామీజీల దగ్గర రూ.10 కోట్లు ఎలా వచ్చాయని అడిగారు.స్వామీజీలు ఇంత డబ్బు ఎలా సంపాదించారని ప్రశ్నించారు.
వీరంతా నిజంగానే ఆధ్మాత్మిక స్వామీజీలా లేక దొంగ స్వామీజీలా అని అడిగారు.ఈ క్రమంలో అక్రమంగా సంపాదించిన సొమ్ముకు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.
సనాతన ధర్మంలో ఉన్న నియమాలపై డీఎంకే చివరి వరకు పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.