తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళ 4 సంవత్సరాల జైలు శిక్ష అనంతరం సోమవారం తమిళనాడులో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.శశికళ జైలు నుండి బయటకు రావడంతోనే జయలలితకు తానే వారుసురాలినని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని సంచలన ప్రకటన చేసి తమిళులను ఆశ్చర్యపరిచారట.
ఇక శశికళ ప్రకటన తమిళనాడులో చర్చాంశనీయంగా మారింది.ఇకపోతే తమిళనాడు ప్రభుత్వం శశికళకు మరో గట్టి షాక్ ఇచ్చింది.కాగా, ఇటీవలె చెన్నైలోని 6 ప్రాంతాల్లో ఉన్న వందల కోట్ల విలువైన ఆస్తులను తమిళనాడు ప్రభుత్వం జప్తు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా తూత్తుకుడి జిల్లాలో 800 ఎకరాల భూములతో పాటు పలు చోట్ల కోట్లాది రూపాయల విలువైన భూములను సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో జప్తు చేసింది.
ఈ ఆస్తులన్నీ ఇలవరసి, సుధాకరణ్ పేరుతో ఉన్నట్లు సమాచారం.ఇకపోతే 2017లో అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.