డెడ్ లైన్ దాటితే రెడ్ లైనే... అమెరికా, బ్రిటన్ దేశాలకు తాలిబాన్ల హెచ్చరిక

ఆగస్టు 31 తర్వాత కాబూల్ లో మీ సైన్యం కనిపిస్తే డెడ్ లైన్ కాస్త రెడ్ లైనే అవుతుందని అమెరికా బ్రిటన్ దేశాలకు తాలిబన్లు హెచ్చరించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ బలగాలు పొడిగింపునకు అనుమతించబోమని తాలిబన్ అధికార ప్రతినిధి ‘సుహైల్ షాహీన్‘ స్పష్టం చేశారు.

 Talibans Warn Usa And Uk To Remove All Forces From The Afghanisthan, Talibans ,w-TeluguStop.com

జాప్యానికి తావువుండదని గడువు తీరితే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఈ దేశాన్ని మీ ఆధీనంలోనే ఉంచుకున్న పక్షంలో ప్రతీకార చర్యలకు దిగుతామన్నారు.

ఈనెల 31లోగా సైనికుల ఉపసంహరణ ముగించాలని  తెలిపారు.వ్యవధి కోరిన  ఇవ్వమన్నారు.

ఆఫ్గాన్ లో తమ దేశస్థుల తరలింపు పూర్తికాని పక్షంలో సైనిక దళాల ఉపసంహరణపై మరికొంతకాలం పొడిగించే అవకాశాలు ఉన్నాయని దీనిపై చర్చలు జరుగుతున్నాయని బైడెన్ పేర్కొన్నారు.బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా బైడెన్ చర్యలకు ఏకీభవించారు.జీ-7  సదస్సు లో దీనిపై చర్చిద్దాం అన్నారు.

Telugu Boris Johnson, Joe Biden, Suhail Shaheen, Talibans, Usa Uk-National News

ఆఫ్గాన్ నుంచి ప్రజలు తరలింపు జోరుగా కొనసాగుతోంది ఈ ప్రక్రియ 31వ తేదీలోగా పూర్తి కావచ్చని అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు.ఈ నెల 31 వరకు గడువు పెట్టుకున్నట్లు చెప్పారు.ఇదే విషయమై తమ సైన్యంతో చర్చించినట్లు చెప్పారు.ఆఫ్గాన్ లో 15 వేల మంది అమెరికన్లు.50 వేల మంది ఆఫ్గాన్ లు ఉన్నట్టు అంచనా అని అమెరికా ఇటీవలే పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube