కొందరు మనుషులు క్షణికావేశానికి లోనై తమ జీవితాలను కటకటాల పాలు చేసుకుంటున్నారు.తాజాగా నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబంలో గొడవలు పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి తండ్రిని కన్న కొడుకు హతమార్చిన సంగతి తెలిసిందే.
ఈ కేసును వారం రోజులు కూడా గడవకముందే పోలీసులు ఛేదించిన వివరాలను మీడియా ముందు ప్రజలకు తెలిపారు.
వివరాల్లోకి వెళితే సయ్యద్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ పరిసర ప్రాంతంలో సయ్యద్ భూదార్ అనే వ్యక్తి తన కొడుకుతో కలిసి నివాసం ఉంటున్నాడు.
అయితే నిత్యం సయ్యద్ మదర్ మద్యం మత్తులో మునిగి తేలుతూ ఉండేవాడు.అంతేగాక ఈ విషయం తన కొడుకుకి నచ్చేది కాదు.అలాగే ఈ మధ్యకాలంలో ఓసారి సయ్యద్ ఫుల్లుగా మద్యం తాగి తనకు కోడి కూర వండి పెట్టమని కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్ట సాగాడు.దీంతో అతడి చేష్టలకు విసిగిపోయిన టువంటి అతడి కొడుకు సయ్యద్ ని చంపాలని నిర్ణయించుకున్నాడు.
ఇందులో భాగంగా మద్యం మత్తులో నిద్రపోతున్నటువంటి తన తండ్రిపై పక్కనే ఉన్నటువంటి బండరాయి తెచ్చి తలపై మోదాడు. దీంతో సయ్యద్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందా డు.ఇది గమనించిన టువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సమాచారం అందుకున్ టువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా అతడి కొడుకు ని విచారించగా అతడు నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు.