కాపీ కొట్టకుండా విద్యార్థులకు వింత హెడ్‌గేర్స్‌.. ఫొటోలు చూస్తే నవ్వాగదు..

పరీక్షల సమయంలో పక్కన లేదా ముందు ఉన్న వారి ఆన్సర్ పేపర్ చూసి కాపీ కొట్టడం విద్యార్థులకు అలవాటే.ఈ పని అందరూ చేయక పోవచ్చు కానీ కొందరు మాత్రం ఎప్పుడూ చేస్తూనే ఉంటారు.

 Strange Headgears For Students Without Copying, Viral News , Thailand, Funny Pho-TeluguStop.com

ఇలాంటి కాపీ విధానాన్ని ఆపడం ఉపాధ్యాయుల వల్ల కూడా కాదు.అయితే తాజాగా ఫిలిప్పీన్స్‌లోని లెగాజ్‌పి సిటీలోని ఒక కళాశాలకు చెందిన ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులను పరీక్షల్లో కాపీ కొట్టకుండా ఆపడానికి ఒక గొప్ప ఆలోచన చేశారు.

మేరీ జాయ్ మండేన్-ఓర్టిజ్‌ అనే ఒక ప్రొఫెసర్ తన విద్యార్థులకు పరీక్షలలో ఒక తలపాగా ధరించమని చెప్పారు.టోపీ లాంటిది ధరిస్తే పక్కకు చూడటం కుదరదు.

అందువల్ల కాపీ కొట్టడం కూడా వీలు కాదు.అందుకే ఆ టీచర్ టోపీలు తయారు చేసుకొని రమ్మని ఆదేశించారు.

దాంతో విద్యార్థులు క్రియేటివ్‌గా ఆలోచించి ఫన్నీ డిజైన్‌లతో టోపి తయారు చేసుకొని పరీక్ష రాయటానికి వచ్చారు.ఆ టోపీలను చూసి ప్రొఫెసర్ ఆశ్చర్యపోయారు.అనంతరం విద్యార్థులు తలపాగాతో పరీక్షలు రాస్తున్న ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.2013లో థాయ్‌లాండ్‌లో ఉపయోగించిన ఒక టెక్నిక్‌ను ఫాలో ఎందుకు ఇలా ఆదేశించాలని ఆ ఉపాధ్యాయురాలు పేర్కొన్నారు.

వైరల్ అవుతున్న ఫొటోలలో విద్యార్థులు మనీ హీస్ట్ మాస్క్, ఎగ్స్ సెట్, ఇంకా రకరకాల టోపీలు చూడవచ్చు.ఇవి చూసిన నెటిజన్లు విద్యార్థుల క్రియేటివిటీని సెన్సాఫ్ హ్యూమర్ ని బాగా పొగుడుతున్నారు.వీటిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube