గత ఏడాది శ్రీలీల( Sreeleela ) దాదాపు ఏడాది మొత్తం ఏదో ఒక సినిమాతో బిజీగానే ఉంది.దాదాపు 6 నెలల్లో ఐదు సినిమాలు విడుదల చేసి హల్చల్ చేసింది.
అయితే ఆమె నటించినా దాదాపు అన్ని సినిమాలు ఒకటి రెండు తప్ప అన్ని పరాజయం పాలు కావడంతో శ్రీలీల కెరియర్ మాత్రం ఇప్పుడు ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉంది.అయితే శ్రీలీల కు మామూలు తెలివి తేటలు లేవు.
ఆమె ప్రస్తుతం తన సీనియర్ హీరోయిన్స్( Senior Heroines ) లాగానే తాను కూడా పని చేయాలనుకుంటుంది.తెలుగులో అవకాశాలు రాకపోతే పక్క భాషలో అవకాశాలు వెతుక్కోవడం పెద్ద విషయమేమీ కాదు మన తారలకు.
ప్రస్తుతం శ్రీ లీల కూడా అదే దోవలో వెళ్తోంది.

స్కంద, ఆది కేశవ, గుంటూరు కారం, భగవంత్ కేసరి, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ వంటి వరుస సినిమాల్లో నటించి ఏడాది ఫుల్ జోష్ లో ఉంది శ్రీలీల.కానీ ఈ ఏడాది ఆమె పూర్తిగా ఖాళీ అయిపోయింది.గుంటూరు కారం( Guntur Kaaram ) సినిమా తర్వాత దాదాపు ఆమె షూటింగ్స్ కి హాజరు అయ్యే పరిస్థితి లేదు.
విజయ్ దేవరకొండ తో( Vijay Devarakonda ) ఓ సినిమా ఉన్నప్పటికి అది ఎప్పుడు మొదలవుతుందో తెలియదు.ఇక పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఆయన ఎప్పుడు సినిమా తీస్తారో ఆయనకే తెలియదు.దీంతో శ్రీలీల ఖాళీగా ఉండిపోయింది.చాలామంది ఆమె మళ్ళి మెడిసిన్ చేస్తుంది అనుకుంటున్నారు కానీ ఈ అమ్మడు తెలివి తేటలు మామూలుగా లేవు.

గతంలో తమన్నా, హన్సిక, అంజలి వంటి సీనియర్ హీరోయిన్స్ అంతా కూడా తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ బాట పట్టినట్టుగానే శ్రీలీల కూడా అదే పని చేయబోతోంది.అంత ఎందుకు నిన్న మొన్న కృతి శెట్టి( Krithi Shetty ) కూడా మూడు బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చిన తర్వాత పరాజయాలు చవిచూడటంతో ఆమెను ఐరన్ లెగ్ గా భావించి ఎవరు తీసుకోకపోవడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాగ్ సర్దుకొని తమిళ్ లో బిజీ అవుతుంది.ఇక ఈ మధ్య శ్రీలీల కూడా తమిళనాట ఒక కాలేజ్ ఫంక్షన్ కి వెళ్లి అక్కడ కోలీవుడ్ లో నటించాలని ఉందని తన మనసులో మాట బయట పెట్టింది.
దాంతో ఖర్చీఫ్ అక్కడ వేసావా అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేయడం మొదలు పెట్టారు.ఏది ఏమైనా శ్రీలీల తెలివికి అందరు జోహార్ చెపుతున్నారు.