తెలంగాణలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది.ఈ మేరకు ఎన్నికల టీమ్ ను ఏర్పాటు చేయనుంది.
ఇందులో భాగంగా తాజాగా ఏఐసీసీ సెక్రటరీలుగా ఇద్దరిని నియమించింది.మన్సూర్ అలీఖాన్, పీసీ విష్ణునాథ్ ల నియామకం వెంటనే అమలులోకి వస్తుందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
అయితే తెలంగాణలో ఎన్నికలు రానుండటంతో కాంగ్రెస్ అచితూచి అడుగులు వేస్తుంది.