ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి.
తిరుపతి జిల్లా శ్రీహరికోట వరకు రుతుపవనాలు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఉత్తర శ్రీహరి కోటతో పాటు తమిళనాడులోని ధర్మపురి, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయని పేర్కొంది.
ఈ క్రమంలో రేపు మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది.దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.