దశాబ్ది ఉత్సవాల సంబరాలు కాదు, విద్యారంగ సమస్యలపై సమరానికి విద్యార్థులు సన్నద్ధం కావాలి: పి డి ఎస్ యూ పిలుపు

సర్కారు బడులలో కనీస సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్, రాష్ట్ర సహయ కార్యదర్శి సంద్య లు ఆరోపించారు.స్థానిక ఖమ్మం నగరంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన పిడిఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి స్కూల్స్ ప్రారంభిస్తామని చెప్పిన విద్యా శాఖ మంత్రి విద్యార్ధులకు ఇంత వరకు పూర్తీ స్థాయిలో బుక్స్, యూ నిఫామ్స్ ఎందుకు సిద్దం చేయలేదన్నారు.ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు, టాయిలెట్స్ కొరత తీవ్రంగా ఉండగా టీచర్ల ఖాళీలను నింపకుండా దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరపాలని చెప్పడం ఈ ప్రభుత్వ ద్వంద వైఖరికి నిదర్శనం అన్నారు.
ప్రభుత్వ బడులను బాగుచేసేందుకు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు- మన బడి’ పథకా నీ నిధుల కేటాయింపు సక్రమంగా లేక ఆశించిన మార్పు రాక, కేవలం కొన్ని బదులనే ఎంపిక చేశారు.ఎంపిక చేసిన బడిలో మౌలిక సదుపాయాలు , స్వరూపం, కూడా ఏం మారనటు వంటి దుస్థితి దాపురించిందన్నారు.

 Pdsu State Secretary Comments On Trs Govt, Khammam, Pdsu, Student Union-TeluguStop.com

రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్ధలు, మరెక్కడా లేని ఫీజుల దోపిడీ మన రాష్ట్రంలోనే ఉంది.ప్రైవేటు పాఠశాలలో విచ్చలవిడిగా ఫీజులు దండుకుంటూ అనుమతులు లేకుండా బ్రాంచ్ ను ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు.

ప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఇవి కాకుండా డ్రెస్సులు, పాఠ్యపుస్తకాలు, స్పెషల్ ఫీజులు , అడ్మిషన్ ఫీజుల పేరుతో విద్యార్థులను తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్న పాఠశాలలపై తక్షణమే చర్యలకు ప్రభుత్వం పూనుకోవాలని వారు డిమాండ్ చేశారు.

కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెపుతూ డిగ్రీ, పీజీల ఫీజులు పెంచి, అది విద్యార్థులే చెల్లించాలని నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులకు ఇచ్చిన హామీలు కేసీఆర్ మాటలు నీటి మూటలేనని అర్థమవుతోంది.

అందుకే సంబరాలు కాదు విద్యార్థులు విద్యార్థి, తల్లిదండ్రులూ కలిసి ప్రభుత్వంపై సమరం చేయాల్సిన అవసరం, ఆవశ్యకత నేడు మనపై ఉందన్నారు.

ఈ సమావేశంలో PDSU ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్ సహాయ కార్యదర్శులు దీపిక, నవీన్ జిల్లా నాయకులు వినయ్, శశి, కరుణ్, కార్తీక్, రాజేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube