ఈ ఏడాది రిలీజ్ అయిన పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సాధించాయి.ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి.తొలి రోజు రికార్డు స్థాయిలో డబ్బులు వసూలు చేసిన సౌత్ ఇండియన్ టాప్ 7 సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మాస్టర్ – 56 కోట్లు
విజయ్ దళపతి హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది.ఓపెనింగ్ రోజే రూ.56 కోట్లు సాధించి సరికొత్త రికార్డులు సాధించింది.
వకీల్‌సాబ్ – 52 కోట్లు
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సైతం వసూళ్ల దుమ్ము రేపింది.సినిమా విడుదల అయిన తొలి రోజే రూ.52 కోట్లు సాధించింది.
యువరత్న – 22.5 కోట్లు
యువరత్న సినిమా యాక్షన్ రొమాంటింగ్ గా తెరకెక్కింది.నందమూరి తారకరత్న హీరోగా చేశారు.ఈ సినిమా సైతం తొలి రోజు 22.5 కోట్లు సాధించి వారెవ్వా అనిపిచింది.
రాబర్ట్ – 17 కోట్లు
కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రధాన పాత్రలో నటించిన రాబర్ట్ సినిమా దుమ్ము రేపింది.తొలి రోజునే ఈ సినిమా రూ.17కోట్లు సాధించింది.
కర్ణన్ – 13 కోట్లు
ఈ ఏడాది విడుదలైన కర్ణన్ మూవీ సైతం భారీగా వసూళ్లు సాధించింది.ఈ మూవీ 2021, మే 14న అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదలైంది.ధాను నిర్మించిన ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు.సినిమా విడుదల అయిన తొలి రోజునే రూ.13 కోట్లు వసూలు చేసింది.
సుల్తాన్ – 9.20 కోట్లు
కార్తి, రష్మిక మందాన నటించిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల అయ్యింది.తెలుగు, తమిళంలో ఒకే రోజు రిలీజ్ అయ్యింది.ఈ సినిమా తొలి రోజునే 9.20 కోట్లు వసూళు చేసింది.
ది ప్రీస్ట్ – 5.72 కోట్లు
మలయాళంలో మమ్ముట్టి నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది.పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన మమ్ముట్టి వరుస ఆత్మహత్యల మిస్టరీని చేధించడం ఈ సినిమా స్టోరీ.ఈ సినిమా రిలీజ్ అయిన తొలి రోజునే రూ.5.72 కోట్లు సాధించింది.