తెలంగాణలో ప్రొ.కోదండరామ్ అంటే తెలియని వారుండరు.
ఎందుకంటే ప్రత్యేక రాష్ట్ర మలిదశ తెలంగాణ ఉద్యమ రథసారథుల్లో ఒకరిగా ప్రొఫెసర్ కోదండరామ్ కీలక పాత్ర పోషించారు.
కానీ కొన్ని అనుకోని పరిస్దితుల వల్ల టీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చి ప్రత్యేక పార్టీ స్దాపించాడు కానీ రాజకీయ కుతంత్రంలో ఓడిపోయి ప్రస్తుతం రాజకీయ భవిష్యత్తు కోసం తనకు అన్యాయం చేసిన వారితో పోరాడే బలం కోసం ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్, నాంపల్లిలోని గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతు తెలంగాణ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రజల బ్రతుకులు బానిసలుగా మారాయని, ప్రజల స్వేచ్చను హరించే పాలన ఇక్కడ జరుగుతుందని ఆరోపించారు.
బంగారు తెలంగాణ దొరల పాలనలో అప్పుల తెలంగాణలా మారిపోయిందని, పేదల పొట్ట కొట్టు సంపాదించి పెట్టు అనేలా గులాభి దండు ప్రవర్తిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.