సోనూసూద్( Sonusood ).పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిన విషయం తెలిసిందే.వేలాది మందికి సహాయం చేసి రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నారు సోనూసూద్.
ఇప్పటికీ అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు.సినిమాలలో విలన్ పాత్రలో నటించినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నారు.
కరోనా మహమ్మారి తరువాత సోనూసూద్ ని ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరిగింది.చాలామంది ఆయనని దేవుడిగా భావించి భక్తిశ్రద్ధలతో పూజలు కూడా చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఆయన సినిమాల ద్వారా కంటే ఎక్కువగా సామాజిక కార్యక్రమాల విషయంలోనే శ్రద్ద చూపుతున్నారు.
ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్( Commercial ads ) లో నటిస్తూ బాగానే సంపాదిస్తున్నారు.
ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఈ నటుడు తన అభిమానులతో కలిసి దీపావళీ పండుగను జరుపుకున్నాడు.సోనూసూద్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు ముంబైలోని ఆయన ఇంటి ముందు అభిమానులు భారీగా గుమిగూడారు.
అయితే వారిని చూసిని ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చి అందరిని ఎంతో ఆత్మీయంగా పలకరించారు.ఈ ఏడాది దీపావళిని అభిమానులతో కలిసి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి సెల్ఫీలకు పోజులిచ్చి సంబరాలు చేసుకున్నాడు.
అనంతరం ఆయన మీడియాతో స్పందిస్తూ.దీపావళిని ఇలా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటున్నట్లు భావిస్తున్నాను.
వారి ప్రార్థనలతోనే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను.
పండుగ రోజు ఏదైనా పార్టీకి వెళ్లి సరదాగా ఉండటం కంటే ఇలా వారితో గడపడం మనసుకు హత్తుకునేలా ఉందని తెలిపారు సోనూసూద్.తర్వాత అక్కిడికి వచ్చిన అందరికీ స్వీట్స్ గిఫ్ట్ ప్యాక్స్ ఇచ్చారు.కొందరికి పేద విద్యార్థులకు ట్యాబ్స్ కూడా ఇచ్చారు.
చాలా మంది అభిమానులు వారికున్న ఇబ్బందులు తెలుపుతూ సాయం చేయాలని ఒక అర్జీ పత్రాన్ని సోనూసూద్‌కు ఇచ్చారు.అవన్నీ స్వీకరించిన సోనూ త్వరలో కాల్ చేస్తామని తెలిపారు.
దీంతో వారంతో ఆయనతో సంతోషంగా దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.కరోనా సమయంలో దేశంలోని చాలా మందికి వివిధ మార్గాల్లో సహాయం చేయడం ద్వారా సోనూ సూద్ నిజ జీవితంలో కూడా హీరో అయ్యాడు.
అవసరమైన వారికి సహాయం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.
కాగా బీహార్ ( Bihar )లోని నవాడా నగరంలోని పక్రిబరవన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోగన్ పంచాయతీ అమర్‌పూర్ గ్రామంలో గుల్షన్( Gulshan ) అనే 11 నెలల పాప పుట్టుకతోనే అంధురాలు.కుటుంబం కూడా నిరుపేద కావడంతో చిన్నారికి ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేదు.ఇలా చిన్నారి చికిత్సకు అయ్యే ఖర్చును భరించిన సోనూసూద్ గుల్షన్‌కు కంటిచూపు వచ్చేలా చేశాడు.
అలాగే కొన్ని నెలల క్రితం ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి సోనూసూద్ సాయం చేశాడు.ఉజ్జయినిలోని కనిపూర్‌లోని తిరుపతి ధామ్‌లో నివసిస్తున్న అథర్వ స్పైనల్ మస్కులర్ అట్రాఫీ స్మా-2తో బాధపడుతున్నాడు.
బాలుడి తల్లిదండ్రులు నటుడు సోనూసూద్‌ను కలుసుకుని చిన్నారి అనారోగ్యంపై తమ బాధను పంచుకున్నారు.అందువలన, వారు అధర్వకు చికిత్స కోసం అన్ని విధాలుగా సహాయం చేశారు.అంతే కాకుండా బిడ్డ చికిత్స కోసం వీలైనంత ఎక్కువ విరాళాలు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.త్వరలో ఆ చిన్నారికి ఆపరేషన్ చేపించేందుకు ఆయన అన్నీ ఏర్పాట్లు చేశాడు.
ఇలా ఎప్పటికప్పుడు తన గొప్ప మనసును చాటుకుంటూ అందరి మన్నలను పొందుతున్నాడు సోనూసూద్.