వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కిలో బియ్యం రూ.38 కి కేంద్రం కొని ఇస్తుంటే జగన్ బొమ్మ వేసుకుని ప్రజలకు పంచడం దౌర్భాగ్యమని తెలిపారు.
దమ్ముంటే మోదీ బొమ్మ కూడా వేయాలని సోము వీర్రాజు సూచించారు.
అభివృద్ధి లేదు.ఏపీని అప్పులపాలు చేస్తున్నారని విమర్శించారు.
ఆంధ్ర రాష్ట్రానికి ఇంతవరకు రాజధాని లేదని ఎద్దేవా చేశారు.ఏపీని నిర్వీర్యం చేసే పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయొద్దని సూచించారు.