పెళ్లి మీద తన ఒపీనియన్ చెప్పిన రీతూ చౌదరి.. అలా ఉంటే బెటర్ అంట?

తెలుగు బుల్లితెరకు చెందిన సీరియల్ నటి, సోషల్ మీడియా స్టార్ రీతూ చౌదరి. ఈమె గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Ritu Choudhary Expressed Her Opinion On Marriage Details, Ritu Choudhary ,marria-TeluguStop.com

టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది.కెరీర్ మొదట్లో టిక్ టాక్ వీడియోలు చేస్తూ అందరి దృష్టిలో పడి మంచి అభిమానం సంపాదించుకుంది.

ఆ తర్వాత కొన్ని షార్ట్ వీడియోలు కూడా చేసి నటనకు గుర్తింపు తెచ్చుకుంది.అలా ఆమెకు వెండితెరపై సైడ్ ఆర్టిస్టులాగా బుల్లితెరపై సీరియల్ నటిగా అవకాశం రావడంతో ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.

బుల్లితెరపై గోరింటాకు సీరియల్ లో అడుగు పెట్టి తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఆ తర్వాత అమ్మకోసం, ఇంటి గుట్టు వంటి సీరియల్స్ లో కూడా నటించింది.

సీరియల్ నటిగా తనకు మంచి పేరు వచ్చింది.ఇక ఓసారి కామెడీ షో జబర్దస్త్ లో గెస్ట్ గా అడుగుపెట్టింది.

ఇక తొలిచూపులతో జబర్దస్త్ ప్రేక్షకులను ఆకట్టుకోవటంతో ఇక అక్కడ లేడీ కమెడియన్ గా సెటిల్ అయ్యింది.ఇక తను కూడా బాగా కామెడీ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది.

Telugu Actressritu, Jabardasth, Ladyritu, Ritu Choudhary, Rituchoudhary-Movie

జబర్దస్త్ లో తోటి కమెడియన్స్ తో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.ఓవైపు సీరియల్స్ లో కూడా బాగా బిజీగా మారింది.అంతేకాకుండా తీరిక సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో అడుగుపెట్టి మరింత హల్ చల్ చేస్తుంది.ఈమె షేర్ చేసుకునే ఫోటోలు చూస్తే మాత్రం మతి పోవడం గ్యారెంటీ.

సీరియల్ టైం లో కాస్త బ్రేక్ దొరికితే చాలు తోటి నటులతో రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.

Telugu Actressritu, Jabardasth, Ladyritu, Ritu Choudhary, Rituchoudhary-Movie

అలా సోషల్ మీడియాలో ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.తను ధరించే దుస్తులను చూస్తే మతి పోతుంది.పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా షో చేస్తుంది.

ఈమె తండ్రి కూడా ఈమెతో చాలా రీల్స్ చేశాడు.అవి కూడా బాగా క్లిక్ అయ్యేవి.

అలా తన తండ్రిని కూడా సోషల్ మీడియా ప్రియులకు పరిచయం చేసింది రీతూ చౌదరి.అయితే ఇటీవలే తన తండ్రి మరణించిన సంగతి తెలిసిందే.

Telugu Actressritu, Jabardasth, Ladyritu, Ritu Choudhary, Rituchoudhary-Movie

దీంతో ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ బాగా ఎమోషనల్ అయింది రీతూ. ఇక అప్పటినుండి సోషల్ మీడియా వేదికగా బాగా రిఫ్రెష్ అవుతుంది.తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టి తన బాధను తగ్గించుకుంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఫాలోవర్స్ తో మరోసారి ముచ్చట్లు పెట్టింది.వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పింది.అయితే ఓ నెటిజన్ పెళ్లి మీద ఒపీనియన్ చెప్పండి అని అడిగటంతో.

చేసుకోకపోతే బెటర్ అంటూ సమాధానం ఇచ్చింది.ప్రస్తుతం ఆమె చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube