బిగ్ బాస్(Bigg Boss) సీజన్ సెవెన్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది మరొక వారం రోజులలో ఈ కార్యక్రమం పూర్తి కానుంది ఈ ఆదివారం బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలియనిది ఇప్పటికే హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్ లో ఉన్నారు.ఇక టైటిల్ పోరు మాత్రం ప్రశాంత్ అమర్ శివాజీ మధ్య కొనసాగుతోంది.14వ వారం హౌస్ నుంచి శోభాశెట్టి బయటకు రాగా మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్లు టాప్ ఫైవ్ కోసం కృషి చేస్తున్నారు.అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా మరొకరు బయటకి రాగా మిగిలిన ఐదుగురు ఫినాలేకు వెళ్లబోతున్నారు.
బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా గతవారం కంటెస్టెంట్ల మధ్య పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకున్నాయి.శివాజీ శోభా శెట్టి అమర్ ప్రశాంత్ మధ్య గొడవలు తారస్థాయికి చేరుకోవడంతో నాగార్జున (Nagarjuna) కూడా వారికి తన స్టైల్ లోనే క్లాస్ పీకారు.
ఇక అమర్ (Amar) కొన్నిసార్లు కంట్రోల్ తప్పి హౌస్ లో ప్రవర్తిస్తున్నారు.దీంతో పలువురు ఆయన పట్ల విమర్శలు చేయగా మరికొందరు మాత్రం అమర్ కి భారీ స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు.
ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు అమర్ కు మద్దతు తెలియజేయడం విశేషం.
మొదటినుంచి కూడా అరియాన అమర్ కు పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తోంది.తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ సోహెల్ (Sohel) అమర్ గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఆయనకు మద్దతు తెలియజేశారు.అమర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మాత్రమే కాకుండా నాకు పర్సనల్గా తెలిసిన వ్యక్తి.తను చాలా మంచి వ్యక్తి నా అనుభవంతో చెబుతున్నాను.ఇక బిగ్ బాస్ కార్యక్రమం అనేది రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుంది.అక్కడ ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో అసలు అర్థం కాదు.ఎవరి అభిప్రాయాలు వారివి కొంతమందికి కోపం వస్తుంది.
మరి కొంతమందికి ఓపిక ఉంటుంది కానీ అమర్ మాత్రం ఫేక్ కాదు తను చాలా జెన్యూన్ గా ఆడుతున్నారు అంటూ తన మద్దతును అమర్ కు తెలియజేశారు.