ప్రకృతి విపత్తుల గురించి అందరికీ తెలిసినదే.ఒక్కసారి ప్రకృతి ప్రకోపించిందంటే అందులో సర్వస్వము కొట్టుకు పోవాల్సిందే.
అందులోని తుఫాను( Storm ) ఓ భాగం.తుఫాను ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దాని ధాటికి ఎటువంటి బలమైన వస్తువులైనా గాల్లో ఎగరాల్సిందే.అందులో తొక్కలో సోఫా ఎంత అని అనికుంటున్నారా? మామ్మూలుగా ఎగిరితే ఇక్కడ మాట్లాడుకోవలసిన పనిలేదు.ఓ తుఫాను తీవ్రతకు సోఫాలు( sofa ) గాల్లో చిత్తుకాగితాలు మాదిరి ఎగిరిన వైనాన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మనం చూడవచ్చు.
అవును, టర్కీలోని తుఫాన్ కారణంగా ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది.
అందుకు సంబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.కాగా దానిని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
అవును, ఇక్కడ దృశ్యాన్ని చూస్తే మీకే అర్ధం అవుతుంది.టర్కీ( Turkey )లో తాజాగా వచ్చిన తుఫాను సృష్టించిన బీభత్సానికి ఓ ఇంట్లోని సోఫాసెట్ అమాంతం ఆకాశంలోకి ఎగిరిపోయింది.
అది ఎంత ఎత్తులో ఎగిరిందో చెప్పడం కష్టమే.అలా ఎగురుకుంటూ వెళ్లి ఓ ఎత్తయిన భవనాన్ని బలంగా తాకడం వీడియోలో చూడవచ్చు.
టర్కీ దేశ రాజధాని అంకారా( Ankara )లో ఈదురు గాలుల ధాటికి ఏకంగా ఎంతో బరువైన సోఫాసెట్ అలా ఎగిరి పోవడం స్థానికులతో పాటు నెటిజన్లను కూడా ఆశ్చర్యపరుస్తోంది.దాంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దానికి సంబందించిన వీడియో.కాగా ఈ వీడియో ఫుటేజీని గురు ఆఫ్ నథింగ్ అనే యూజర్ తన ట్విట్టర్‌లో పోస్టు చేయగా వెలుగు చూసింది.అంకారాలో కురిసిన తుఫాను వల్ల పలు సోఫాలు గాలిలో ఎగిరిపోతున్నాయంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
దాంతో వేలాదిమంది లైక్ చేస్తూ తమదైనశైలిలో కామెంట్లు చేశారు.