వాలంటీర్లను పార్టీ( volunteers ) కార్యకర్తల్లా ఉపయోగించుకుంటున్నారన్న విమర్శల మధ్య వాలంటీర్లే తన బలం, వాలంటీర్ లే తన సైన్యం అని ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్( Jagan ) .మూడో ఏడాది వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన వాలంటీర్ల వ్యవస్థ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వఖజానా నుంచి జీతాలు చెల్లిస్తూ వీరిని పార్టీ కార్యకర్తల లాగా ఉపయోగించుకుంటున్నారన్న ప్రతిపక్షాల విమర్శలపై ఇంతకాలం మౌనంగా ఉన్న జగన్ ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చినందున ఈ వ్యవస్థ తాలూకు క్రెడిట్ తన ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది.2.66 మంది లక్షల మంది సైన్యం ఉన్న మహావ్యవస్థ ఇది అని,కోడి కూయకముందే ప్రతి ఇంటికి పెన్షన్ అందించే ఇలాంటి వ్యవస్థ దేశం మొత్తం మీద ఎక్కడైనా చూశారా? అంటూ ఆయన ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి జగన్ నమ్మకమే ఈ వాలంటీర్లు, 22 రకాల సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లు ఈ వాలంటీర్లు….ఇప్పటివరకు మూడు లక్షల కోట్ల ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) ప్రజలకు అందించిన ఇది ఒక మహా వ్యవస్థని.దీనిపై ఓర్వలేని తనంతోనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని పేదలకు చేసే ప్రతి మంచిని వక్ర బుద్ధితో చూస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు నిజానిజాలు వివరించే సత్యసారధులు మీరే అంటూ ఆయన వాలంటీర్లను ప్రశంసించారు.
జన్మభూమి కమిటీల లాంటి దుర్మార్గ కమిటీలతో వ్యవస్థలో అవినీతిని పెంచి పోషించిన తెలుగుదేశం( telugudesam ) గంజాయి మొక్క లాంటి స్కీములు మధ్య తులసి మొక్క లాంటి స్కీముగా ఆయన వాలంటీర్ వ్యవస్థను అభివర్ణించారు.

రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ పై మంచి స్పందన వచ్చినందున ప్రతిపక్షాల విమర్శలను కూడా తోసిరాజని వాలంటీర్ వ్యవస్థ( Volunteer system ) తన పార్టీ విధానాలను ప్రచారం చేస్తుందన్న సంకేతాలను ఆయన ఇచ్చారు .అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దుచేసి జన్మభూమి కమిటీల్లో ఉన్న కార్యకర్తలను తీసుకువచ్చి కొత్తగా ఇందులో పెడతారని తద్వారా ఇప్పుడున్న వారి జాబులు పోతాయి అన్న సంకేతాలను వాలంటీర్లకు ఇవ్వడంలో జగన్ విజయవంతమైనట్లే కనిపిస్తుంది .2.6 లక్షల మందికి ప్రత్యక్షంగాను దాదాపు పది లక్షల మందికి పరోక్షంగానే ఉపాధి కల్పిస్తున్న ఈ పథకం వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓట్లు వర్షం కురిపించే పథకం అని పార్టీ బలంగా నమ్ముతుంది .







