ఈ దేశంలో భారీగా కురుస్తున్న మంచు.. రెండు వేల విమానాలకు పైగా రద్దు..

ప్రపంచవ్యాప్తంగా మన దేశ ప్రజలు ఎక్కడ ఉన్నా క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు కచ్చితంగా వారి కుటుంబ సభ్యులతో పాటు ఎంతో ఘనంగా వైభవంగా భారతదేశానికి వచ్చి జరుపుకుంటారు. అమెరికాలో ఉన్నా మన దేశస్తులు క్రిస్మస్ సెలవులకు భారత్కు రావడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

 Snow Is Falling Heavily In This Country. More Than Two Thousand Flights Have Bee-TeluguStop.com

మంచు, వాన, గాలి శీతల ఉష్ణోగ్రతలతో అమెరికాలో విమాన సర్వీసులతో పాటు బస్సు, ఆమ్ ట్రాక్ ప్యాసింజర్ రైలు వంటి ప్రజా రవాణా సేవలకు అంతరాయం కలుగుతుంది.భారీగా మంచు కురుస్తూ ఉండడంతో పాటు ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో దేశవ్యాప్తంగా 2270కి పైగా విమానాలను రద్దు చేశారు.

దీనివల్ల గురువారం సాయంత్రం 6 గంటల వరకు 2270 విమానాలను ఆయా విమానయాన సంస్థలు రద్దు చేసినట్లు ప్రకటించారు.ప్రతికూల వాతావరణం ఉండడం వల్ల ముందస్తుగా శుక్రవారం సుమారు 1000 విమానాలను క్యాన్సల్ చేసినట్లు సమాచారం.

శనివారం మరో 85 విమానాలను కూడా రద్దు చేస్తారు.

అంతేకాకుండా గురువారం 7400 పైగా విమానాలు ఆలస్యంగా ప్రయాణించాయని అధికారులు తెలిపారు.

వాటిలో అత్యధికంగా చికాగో, డెన్వర్ నుంచి వచ్చి పోయే విమానాలే పావు వంతు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.అమెరికాలో ఎక్కువగా ఈ రెండు విమానాశ్రయాల నుంచే ప్రజలు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు.

ఇక చికాగోలో మూడు గంటల పాటు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు.క్రిస్మస్, సంక్రాంతి పండుగ ముందు ఇలా జరగడం వల్ల అమెరికాలో ఉన్న భారతదేశ ప్రజలు ఇండియాకి రావడానికి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.దీనివల్ల చాలామంది ప్రజలు భారతదేశానికి వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube