దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం లో వచ్చిన సీతారామం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమాకు అంతా మంచి శకునాలే అన్నట్లుగా ఉంది.
సినిమా కి మంచి బిజినెస్ జరగడం మొదలుకుని మొన్నటి వీకెండ్ వసూళ్ల వరకు అన్ని విషయాల్లో కూడా సీతారామం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.సీతారామం సినిమా నిన్న సోమవారం కూడా మంచి వసూళ్లను దక్కించుకుంది.
కోటిన్నర కు పైగా షేర్ ను సోమవారం రాబట్టడంతో మంగళవారం మరింత ఎక్కువ రాబట్టింది.పండుగ సెలవు అవ్వడం వల్ల విద్యా సంస్థలు తెలుగు రాష్ట్రాల్లో మూత పడ్డాయి.
దాంతో థియేటర్ల వద్ద జనాలు క్యూ కట్టారు.అలా మంగళవారం సినిమా కు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి.
బుద వారం ఒక్క రోజు నెట్టుకు వస్తు మళ్లీ గురు మరియు శుక్ర వారాల్లో సెలవు దినాలుగా ఉన్నాయి.అందుకే ఆ రెండు రోజులు కూడా భారీ గా వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది.
పైగా ఆగస్టు 15 సెలవు కూడా ఈ సినిమా కు కలిసి వస్తుంది.అలా ఈ సినిమా కు సెలవులు పెద్ద ఎత్తున రావడం వల్ల మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ వీకెండ్ వరకు సినిమా బ్రేక్ ఈవెన్ ను సాధించే అవకాశాలు కనపిసి్తున్నాయి.ఇక నుండి సీతారామం సినిమా మరింతగా మంచి వసూళ్లు నమోదు చేస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మణిరత్నం సినిమా వంటి ఒక మంచి సినిమా అంటూ యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెప్పారు.అన్నట్లుగానే ఈ సినిమా కు అలాంటి టాక్ వచ్చింది.మంచి ప్రేమ కథ ను చూడాలి అనుకుంటున్న వారికి ఈ సినిమా మంచి ఛాయిస్ గా పేర్కొంటున్నారు.బింబిసార సినిమా కు మంచి వసూళ్లు నమోదు అవుతున్నా కూడా సీతారామం సినిమా వసూళ్లు జోరుగా ఉన్నాయి.