తండ్రి బస్ కండక్టర్.. కొడుకు సివిల్స్ ర్యాంకర్.. ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ వింటే వావ్ అనాల్సిందే!

సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లు అసాధారణ విజయాలను సొంతం చేసుకోవడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.కొంతమంది మాత్రం అసాధారణ విజయాలను సొంతం చేసుకోవడం ద్వారా సత్తా చాటడంతో పాటు ప్రశంసలు అందుకుంటున్నారు.

 Siddhlingappa Inspirational Success Story Details Here Goes Viral In Social Medi-TeluguStop.com

ఆశ గట్టిదైతే గెలుపు సొంతమవుతుందని కర్ణాటకకు( Karnataka ) చెందిన సిద్ధలింగప్ప ప్రూవ్ చేశారు.కండక్టర్ కొడుకు అయిన సిద్ధలింగప్ప( Siddalingappa ) సివిల్స్ పరీక్షలో మంచి ర్యాంక్ ను సొంతం చేసుకున్నారు.

సిద్ధలింగప్ప తండ్రి పేరు కరసిద్ధప్ప( Karasiddappa ) కాగా అతని సొంతూరు కర్ణాటకలోని దర్వాడ జిల్లాకు చెందినవాడు కావడం గమనార్హం.సిద్ధలింగప్ప సక్సెస్ ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

ఆలిండియా లెవెల్ లో సిద్ధలింగప్ప 589వ ర్యాంక్ ను సాధించారు.తొలి ప్రయత్నంలో సిద్ధలింగప్పకు ఆశించిన ఫలితం రాలేదు.

అయితే రెండో ప్రయత్నంలో మాత్రం సిద్ధలింగప్పకు కోరుకున్న సక్సెస్ దక్కడం గమనార్హం.

ఎలాంటి కోచింగ్ లేకుండా సిద్ధలింగప్ప ఈ స్థాయికి ఎదిగి ఎంతోమంది పేదింటి విద్యార్థులకు స్పూర్తిగా నిలిచారు.టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్( TS RTC MD Sajjanar ) సైతం సిద్ధలింగప్ప సక్సెస్ గురించి ట్విట్తర్ ద్వారా ప్రస్తావిస్తూ అభినందనలు తెలియజేశారు.సిద్ధలింగప్ప సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.

సిద్ధలింగప్ప భవిష్యత్తులో మరింత సక్సెస్ సాధించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సిద్ధలింగప్ప టాలెంట్ ను ఎంత ప్రశంసించినా తక్కువేనని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సిద్ధలింగప్ప బాల్యం నుంచి ఎంతో కష్టపడి చదివేవారని ఇంతకాలానికి టాలెంట్ కు తగిన గుర్తింపు దక్కిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. సిద్ధలింగప్ప సక్సెస్ వెనుక తండ్రి కృషి ఎంతో ఉందని సమాచారం అందుతోంది.

తండ్రి కష్టాన్ని చూసి ఎలాగైనా సక్సెస్ సాధించాలని నిర్ణయం తీసుకుని సిద్ధలింగప్ప ఈ స్థాయికి ఎదిగారని తెలుస్తోంది.ఎంతోమంది యువతీయువకులు సిద్ధలింగప్పను స్పూర్తిగా తీసుకుంటూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube