దోమనేగా అని ఈజీగా తీసేస్తున్నారా.. ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి

న్యూస్ : దోమ అంటే ఒకటే అని చాలా మందికి తెలుసు.కానీ దోమలలో కూడా రకాలు ఎవరికైనా తెలుసా ?.దోమలు కుడితే రకరకాల జబ్బులు వస్తాయని తెలుసుకానీ దోమలలో రకాలేంటి అనుకుంటున్నారా.కానీ మనదేశంలో చాలా ప్రాతాలలో కనిపించి వ్యాధులను వ్యాప్తిచేసే 8 రకాల ప్రత్యేకమైన దోమలున్నాయంట.

 Shocking Facts About Mosquitoes And Its Diseases Details, Mosquito, Types, Healt-TeluguStop.com

అవి ఏంటీ.అసలు అవి ఏ విధమైన రోగాలు వ్యాప్తి చెందేలా చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

దోమల రకాలు.వ్యాధులు

1.అనాఫిలిస్ : మలేరియాను వ్యాప్తి చేసే దోమను అనాఫిలిస్ దోమా అంటారు.ఈ రకమైన దోమలు ఎక్కువగా పగటి పూట కుడుతాయి.అలాగే ఎక్కడైతే ఎక్కువగా నీరు నిలిచి ఉంటుందో అక్కడ ఈ దోమలు ఉంటాయి.
2.ఏడిస్ : రోగాలను వ్యాప్తిచెందించడంలో ఈదోమే మొదటి స్థానంలో ఉంటుంది.ఈ దోమ ద్వారా ప్రాణాంతకర జ్వరాలు వస్తాయి.ఈ రకమైన దోమలు చిత్తడి నేలలు ఎక్కువగా ఉండే చోట ఉంటాయి.
3.మాన్సోనియా : మెదడువాపు వ్యాధిని కలిగించే దోమను మాన్సోనియా అంటారు.ఈ దోమ అన్ని దోమల కంటే భిన్నంగా ఉంటుంది.

రంగు, పరిమాణంలో పెద్దగా కనిపిస్తాయి.

Telugu Mosquitoes, Heal Care, Tips, Healthy, Mosquito, Mosquito Types, Types-Lat

4.క్యూలెక్స్ : ఈరకమైన దోమలు సూర్యాస్తమయం అయిన తర్వాత ఎక్కువగా కనిపిస్తుంటాయి.ఇవి రాత్రి సమయంలో చాలా ఘోరంగా కుడుతుంటాయి.ఈ రకమై దోమలు నీటి కొలనలు, చెరువుల వద్ద ఎక్కువగా ఉంటాయి.
5.కులిసేట: క్షీరదాలు, జంతువులను కుట్టే దోమలను కులిసేట దోమలు అంటారు.ఇవి ఎక్కువగా చల్లటి ప్రదేశాలలో ఉంటాయి.
6.వైయోమియా : కీటకాలను తినే మొక్కలపై కనిపించే దోమలను వైమోమియా అంటారు.ఇవి మనుషులకు అంత ప్రాణాంతకరం కావు.
7.టోక్సోరిన్కైట్స్ : ఈరకమైన దోమలు మనుషుల జోలికి అస్సలే రావంట.పువ్వులు, ఆకులు, లార్వాల రసాన్ని ఇవి సేవిస్తుంటాయి.
8.సోరోఫోరా : ఈ రకమైన దోమలు, మనుషులే కాదు జంతువులను కూడా వదలయంట.చిటికెలో ప్రదేశాలు మారుతూ.అందరి రక్తాన్ని పీల్చుకుంటాయి.ఇవి ఎక్కువ కొట్టాలు.నీటి కుంటల వద్ద ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube