భార్య చెప్పిన ఆ ఒక్క మాట ఈ స్టార్ హీరో జీవితాన్ని మార్చిందా.. కెరీర్ ను మలుపు తిప్పిందా?

కోలీవుడ్ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న హీరోలలో కార్తీ ఒకరు.కార్తీ పూర్తి పేరు కార్తీక్ శివకుమార్( Hero Karthi ) కాగా తమిళంలో కార్తీ నటించిన తెలుగులోకి డబ్ అయ్యి సక్సెస్ సాధించాయి.

 Wife Suggestion Is Plus Point For Hero Karthi Career Details Here Goes Viral In-TeluguStop.com

ఊపిరి సినిమా సక్సెస్ కార్తీకి తెలుగులో మరింత మంచి పేరును తెచ్చిపెట్టింది.సూర్య సోదరుడు అయినప్పటికీ కథల విషయంలో వైవిధ్యం చూపిస్తూ కార్తీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.

యుగానికి ఒక్కడు, ఆవారా( Awara ), నా పేరు శివ సినిమాలు కెరీర్ తొలినాళ్లలో కార్తీకి వరుస సక్సెస్ లను అందించగా ఆ తర్వాత మాత్రం కార్తీకి వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి.ఒక దశలో కార్తీ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావడం సులువు కాదని కామెంట్లు వినిపించాయి.ఆ సమయంలో కార్తీ భార్య( Hero Karthi Wife ) ఎప్పుడూ లవ్ స్టోరీలు చేస్తే ఎలా అని కాలానికి అనుగుణంగా మారాలని యాక్షన్ కథలను, వైవిధ్యం ఉన్న కథలను ఎంచుకోవాలని భర్తకు సూచించింది.

భార్య చెప్పిన మాటలు బలంగా మదిలో నిలిచిపోగా ఆ తర్వాత కార్తీ లోకేశ్ కనగరాజ్( Lokesh Kanagaraj ) డైరెక్షన్ లో ఖైదీ సినిమా( Khaidi Movie )లో నటించి సక్సెస్ ను అందుకున్నారు.ఖైదీ సినిమా తర్వాత కార్తీ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు.భార్య చెప్పిన ఒకే ఒక్క మాట కార్తీ కెరీర్ ను మలుపు తిప్పింది.

కార్తీ రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ రేంజ్ లో ఉంది.

కార్తీకి మరిన్ని విజయాలు దక్కాలని పాన్ ఇండియా విజయాలను ఈ హీరో అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సూర్య, కార్తీ కాంబినేషన్ లో ఒక సినిమాను ప్లాన్ చేస్తే అభిమానులకు కలిగే సంతోషం అంతాఇంతా కాదు.రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ దిశగా అడుగులు పడతాయేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube