మొన్నటివరకు గ్రామ వాలంటీర్.. ఇప్పుడు ఎస్సై.. ఈ యువతి సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )ప్రభుత్వం గ్రామ, వార్డ్ వాలంటీర్లను నియమించి వాళ్ల ద్వారా ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే గ్రామ వాలంటీర్లుగా పని చేస్తున్న వాళ్లలో చాలామంది ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ తమ లక్ష్యాలను సాధిస్తున్నారు.

 Shivayogeswari Inspirational Success Story Details Here Goes Viral In Social Med-TeluguStop.com

వాలంటీర్లు అంటే చిన్నచూపు చూస్తున్న వాళ్లకు షాకిస్తూ కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు.తాజాగా ఎస్సై ఫలితాలు విడుదల కాగా ఈ ఫలితాలలో వాలంటీర్ శివయోగీశ్వరి( Volunteer Sivayogeeshwari ) సత్తా చాటారు.

శివయోగీశ్వరి ఇంతకాలం పాటు మార్కాపురంలో వాలంటీర్ ( Volunteer in Markapuram ) గా విధులు నిర్వహించారు.ఒకవైపు ప్రజలకు మేలు జరిగేలా విధులను నిర్వహిస్తూనే ఎస్సై పరీక్షలకు సిద్ధమై ప్రశంసలు అందుకుంటున్నారు.

నెలకు వచ్చే 5000 రూపాయల గౌరవ వేతనంను శివయోగీశ్వరి ప్రిపరేషన్ కోసం వినియోగించుకున్నారు.తుది పరీక్షల్లో సత్తా చాటిన శివయోగీశ్వరి రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Andhra Pradesh, Shivayogeswari-Inspirational Storys

శివయోగీశ్వరి సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిని ఇస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.శివ యోగీశ్వరి బాల్యం నుంచి కష్టపడి ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయికి చేరుకోవడం గమనార్హం.శివ యోగీశ్వరిని స్పూర్తిగా తీసుకుని కష్టపడి ప్రిపేర్ అయితే మరింత సక్సెస్ సాధించడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.శివ యోగీశ్వరిని నెటిజన్లు ఎంతగానో అభినందిస్తున్నారు.

Telugu Andhra Pradesh, Shivayogeswari-Inspirational Storys

శివయోగీశ్వరి వాలంటీర్ గా పని చేసి ఎస్సై జాబ్ సాధించడం అంటే సాధారణమైన విషయం కాదనే చెప్పాలి.తాజాగా విడుదలైన ఎస్సై( SI ) పరీక్ష ఫలితాలలో ఎంతోమంది పేద విద్యార్థులు సత్తా చాటారు.రేయింబవళ్లు కష్టపడి తమ లక్ష్యాలను నెరవేర్చుకున్నారు.రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది.ఎక్కువ సంఖ్యలో జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube